దేశంలో మహిళలపై దారుణాలు పెరుగుపోతున్న వేళ మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్ళై ఐదుగురు పిల్లలున్న ఓ వివాహిత మహిళపై 17 మంది అత్యాచారం జరిపిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం భార్య భర్తలు ఇద్దరు స్థానికంగా కూరగాయల మార్కెట్ కు వెళ్లి వాహనం పై తిరిగిస్తున్నారు.
దారిలో వారిని అడ్డగించిన నిందితులు భర్తపై దాడి చేసి అతన్ని బంధించారు. అనంతరం భర్త కళ్ళ ముందే మహిళపై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరుసటి రోజు భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కాగా నిందితుల్లో కేవలం ఒక్కరిని మాత్రమే గుర్తించగలలని బాధితురాలి తెలిపింది. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ‘
కాగా జార్ఖండ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు కొత్త కాదు. ఈ నెల 2వ తేదీన స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి వస్తున్న 15 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యచారానికి పాల్పడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది.