logo

  BREAKING NEWS

శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |   విద్యార్థులకు శుభవార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు!  |   కుప్పం కోటలు బద్దలు కొట్టారు.. మంత్రిపై సీఎం జగన్ ప్రశంసలు!  |   హాలీవుడ్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ..?  |   బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్‌.. 23.02.2021 బంగారం ధ‌ర‌లు  |  

సొంత పార్టీ పై సంచలన వ్యాఖ్యలు.. ముత్తిరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం అదేనా?

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జనగామ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముత్తిరెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా ఈ కార్యకమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ నాయకుడు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారని, సీనియారిటీ ఆధారంగా పదవులు ఇవ్వాలని అన్నారు.

ఆ తర్వాత ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో నిన్న మొన్న వచ్చిన వారికే పదవులు వచ్చాయని పార్టీలో సీనియర్ గా ఉన్న తనకు మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు. అయితే అందుకు తానేమీ బాధపడటం లేదని పార్టీకి సీఎం కేసీఆర్ కు విధేయుడిగానే పని చేస్తూ వచ్చానని అన్నారు. పార్టీలో కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి కష్టం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూపుతారన్నారు.

సూర్యచంద్రులు ఉన్నత వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని.. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ వల్లనే తనకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ముత్తిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పదవుల విషయంలో హై కమాండ్ పై ఉన్న అసంతృప్తిని ముత్తిరెడ్డి ఈ విధంగా బయటపెట్టారా? అని అనుకుంటున్నారు.

Related News