logo

  BREAKING NEWS

ప్రాణం తీసిన ప్రేమ.. సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య!

ప్రేమ వ్యవహారం ఓ యువతిని బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. కన్న వారికి కడుపుకోతను మిగిల్చింది. చనిపోతూ ఆ యువతి రాసిన సూసైడ్ నోట్ కలచివేస్తుంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోతారం గ్రామానికి చెందిన ఉమా(19) సారంగాపూర్ ప్రభుత్వ కళాశాలలో రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో తోటి విద్యార్ధి రంజిత్19) ను ప్రేమించింది. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది.

ప్రసుతం ఉమ ఇంటి వద్దనే ఉంటూ బీడీలు చుడుతోంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రంజిత్ ను కోరింది. రంజిత్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేసాడు. దీంతో ఉమ తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా కులాలు వేరైనా కూతురు ఇష్టప్రకారం వారు రంజిత్ ను పెళ్లి విషయంపై సంప్రదించారు. ఉమను పెళ్లి చేసుకోవాలని వేడుకున్నారు. అయినా అతను ఒప్పుకోకపోవడంతో ఉమకు వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్‌ వాటిని చెడగొడుతూ ఉమకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఉమను వేధించడం మొదలు పెట్టాడు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇంకెవరు చేసుకున్న ఊరుకోను’ అంటూ మానసికంగా ఆమెను క్షోభకు గురిచేశాడు. నీకు నేను కాకుంటే చావడం తప్ప వేరే మార్గం లేదన్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఉమ సోమవారం ఇంట్లో విషం తాగి ఆత్మత్యకు పాల్పడింది.

సూసైడ్ నోట్ లో.. ‘నువ్వు నన్నే పెళ్లిచేసుకోవాలి లేదంటే చచ్చిపోవాలి’ అంటూ రంజిత్ వేధిస్తున్నాడని తెలిపింది. అతన్ని పెళ్లి చేసుకుని మీకు చెడ్డ పేరు తేవడం ఇష్టం లేదు. నేను బతికుంటే మిమ్మల్ని బాధపెట్టడం తప్ప మీకు ఎలాంటి మంచి జరగదు అందుకే చచ్చిపోతున్న అంటూ తెలిపింది. కాగా ఆమెకు మెరుగైన వైద్యం కోసం కరీం నగర్ ఆసుపత్రికి తరలించగా బుధవారం ఉమ కన్నుమూసింది.

Related News