logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

విషాదం: కరోనా సోకిందనే భయంతో దంపతుల బలవన్మరణం!

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రేకవరీ రేటు కూడా అధికంగానే ఉంది. కరోనా సోకినా వారం పది రోజుల్లో తిరిగి కోలుకుంటున్నారు.కానీ ఈ వైరస్ పై ప్రజల్లో భయాలు మాత్రం తొలగిపోవడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

జిల్లా కంద్రంలోని శివవీధికి చెందిన రాంబాబుకు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. తాజాగా పరీక్షలు చేయించగా ఆతని భార్య లావణ్యకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని లావణ్య చొప్పదండి మండలం అర్నకొండలోని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. తమకు కరోనా సోకిందని సాయంత్రం కరీంనగర్ ఆసుపత్రికి వస్తామని తెలిపింది.

కాగా ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి ఎదురు చూడగా లావణ్య రాంబాబు అక్కడకు రాలేదు. ఫోన్ చేసినా కలవలేదు. దీంతో అదే రాత్రి జగిత్యాలకు వెళ్లారు. ఇంటికి గడి పెట్టి ఉండటంతో కిటికీ తెరిచి చూడగా భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకుని వేళ్ళాడుతూ కనిపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్ నిబంధనల నడుమ అదే రోజు రాత్రి మృతదేహాలకు దహన కార్యక్రమాలు జరిపారు.

కాగా గత పదేళ్లుగా మహారాష్ట్రలో ఉంటున్న రాంబాబు పది నెలల క్రితం తండ్రి మరణించడంతో జిల్లాకు వచ్చాడు. కరోనా కారణంగా తిరిగి వెళ్లలేకపోయాడు. ఈ దంపతులిద్దరికీ పిల్లలు లేకపోవడం, ఇప్పుడు కరోనా సోకిందనే మనస్తాపంతో వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్టుగా సమాచారం.

Related News