logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జగిత్యాలలో విషాదం: మిస్సైన ప్రేమ జంట.. కుళ్లిన స్థితిలో శవాలై..

జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హైదరాపల్లిలో ఓ పాడుబడ్డ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కుళ్ళిన స్థితిలో కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాలను పరిశీలించగా ఈ ఘటన జరిగి పది రోజులయినట్టుగా నిర్దారించారు.

కాగా మృతులు హైద్రాపల్లికి చెందిన నలువాల మధు, సిరిసిల్ల జిల్లా మల్లాపూర్‌కు చెందిన ఐలేని సౌమ్యలుగా అగుర్తించారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మధు స్థానికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూనే ఐలేని కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సౌమ్య కూడా అదే కాలేజీలో చదువుతుంది. వీరిద్దరి ప్రేమ ఇటీవల పెద్దలకు తెలియడంతో గొడవ జరిగింది. ఇద్దరినీ పంచాయతీలో పెట్టి కలుసుకోకుండా చేశారు. ఇకపై కలవబోమని ఓ పాబంధి కాగితం కూడా రాయించుకున్నారు.

ఈ నెల 6వ తేదీ నుంచి సౌమ్య కనిపించకుండా పోయింది. పోలీసులకు తల్లిదండ్రులు సమాచారమివ్వగా మిసింగ్ కేసు నమోదైంది. కాగా వీరిద్దరూ మనస్ధాపంచెంది ఓ పాడుబడ్డ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఎవ్వరూ లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు బాగా కుళ్లిపోవడంతో తల తెగి పడింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News