logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

విషాదం: కరోనాతో జగిత్యాల ఎఎస్పీ మృతి..!

తెలంగాణ పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణా మూర్తి బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. వారం రోజుల క్రితం కోవిడ్ భారిన పడటంతో కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణా మూర్తి వరంగల్ జిల్లా ఎస్సై, సీఐ, డీఎస్పీగా విధులు నిర్వహించారు.

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లోను కీలక పాత్ర పోషించారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో కీలక అధికారిగా వ్యవహరించారు. కరీం నగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో పోలీసు శాఖలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి ఘన స్వాగతం పలికారు. వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి అదే కరోనా భారిన పడి మరణించడంతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణామూర్తి కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Related News