ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. మార్చ్ 10న ఎన్నికలు జరగనున్నాయి. మార్చ్ 14న ఫలితాలు వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 12 మున్సిపల్ కార్పొరేషన్లకు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీల గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి. పంచాయితీ ఎన్నికల అధికార వైసీపీ ఘన విజయం సాధించినా మున్సిపల్ ఎన్నికలపై కొంత ఆందోళనగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో ఆధరణ ఉంది. గ్రామీణ ప్రాంతాలతో చూస్తే పట్టణ ప్రాంతాల్లో అంతగా ఆధరణ లేదనే విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి, ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ విశ్లేషణలు తప్పని, పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే జరిపించారు.
ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే రిపోర్టు చూసిన ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా సంతోషపడ్డారని చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 12కు 12 మున్సిపల్ కార్పొరేషన్లను అధికార వైసీపీ గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. విశాఖపట్నం కార్పొరేషన్లో 98 సీట్లు ఉండగా వైసీపీ 50, టీడీపీ 20 గెలుచుకుంటుంది. 28 సీట్లలో తీవ్ర పోటీ ఉంటుంది.
విజయవాడలోని 64 సీట్లలో వైసీపీ 38, టీడీపీ 12 గెలుచుకుంటుంది. 14 సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. గుంటూరులోని 57 సీట్లలో వైసీపీ 43, టీడీపీ 6 సీట్లు గెలుచుకుంటాయి. ఏడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 50 సీట్లలో వైసీపీ 35, టీడీపీ 7 గెలుచుకుంటాయని, మరో ఎనిమిది స్థానాల్లో తీవ్ర పోటీ ఉంటుందని ఈ సర్వేలో తేలింది.
తిరుపతి కార్పొరేషన్‌లోని 50 సీట్లలో 39 వైసీపీ, 5 టీడీపీ గెలుచుకుంటాయని, ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. కర్నూలు కార్పొరేషన్‌లోని 52 సీట్లలో వైసీపీ 40, టీడీపీ ఆరు సీట్లు గెలుస్తాయని, నాలుగు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వేలో తేలింది. ఏలూరు కార్పొరేషన్‌లోని 50 స్థానాల్లో వైసీపీ 37 సీట్లు గెలుచుకుంటుందని, 9 సీట్లను టీడీపీ గెలుచుకుంటుందని, నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.
అనంతపురం కార్పొరేషన్‌లోని 50 సీట్లలో వైసీపీ 40, టీడీపీ 5 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని, 3 సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. విజయనగరం కార్పొరేషన్‌లోని 50 సీట్లలో వైసీపీ 32, టీడీపీ 14 గెలుచుకోనున్నాయి. నాలుగు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుంది. చిత్తూరులోని 50 సీట్లలో వైసీపీ 45, టీడీపీ 2 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. రెండింట తీవ్ర పోటీ ఉండనుంది. సీఎం జగన్ స్వంత జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్‌ను వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. 50 డివిజన్లలో వైసీపీ 49 గెలుచుకునే అవకాశాలు ఉండగా, ఒక స్థానంలో మాత్రం గట్టి పోటీ ఉంది.