logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు

అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా కేతిరెడ్డి ప‌నితీరు బాగుంద‌ని గుర్తించిన జ‌గ‌న్ ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌నే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే రెండున్న‌రేళ్ల త‌ర్వాత త‌న క్యాబినెట్‌లో 90 శాతం మందిని ప‌క్క‌న‌పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఆయ‌న చెప్పిన గ‌డువుకు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. జ‌గ‌న్ అధికారం చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌య్యింది. ఆరు నెల‌ల త‌ర్వాత క్యాబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చేయ‌డానికి జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. మొద‌టిసారి క్యాబినెట్ ఏర్పాటు చేసిన‌ప్పుడు త‌న వెంట విశ్వ‌స‌నీయంగా న‌డిచిన వారికి, సామాజ‌క స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో చాలామందికి అర్హ‌త ఉన్నా కూడా మంత్రి ప‌ద‌వులు రాలేదు. అయితే, ఈసారి మాత్రం ఎమ్మెల్యేల ప‌నితీరును, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌తీ వైసీపీ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు బాగా అందుబాటులో ఉంటున్నారు ? ఎవ‌రి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఎంత శాతం సంతృప్తి ఉంది ? వంటి వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

ఈ రిపోర్ట్ ఆధారంగానే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రాష్ట్రంలో బాగా ప‌నిచేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల జాబితాలో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి ముందంజ‌లో ఉంటారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌టం, స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డం వంటి విష‌యాల్లో కేతిరెడ్డికి ఈ మ‌ధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరొచ్చింది. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో చాలా సానుకూల‌త ఉంది.

పైగా తెలుగుదేశం పార్టీకి బ‌లమున్న ధ‌ర్మ‌వ‌రంలో ప‌రిటాల కుటుంబాన్ని ఎదుర్కొంటూ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నిక‌ల ద్వారా కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి త‌న స‌త్తా నిరూపించుకున్నారు. ఇటు ప‌నితీరులోనూ, అటు స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ జ‌గ‌న్ పెట్టిన ప‌రీక్ష‌ల్లో కేతిరెడ్డి డిస్టింక్ష‌న్‌లో పాస్ అయ్యారు. దీంతో ఈ సారి కేతిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. షార్ట్‌టైమ్‌లో కేతిరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు రావడం, జ‌గ‌న్ గుడ్‌లుక్స్‌లో ప‌డ‌టం, మంత్రి అవుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఇత‌ర వైసీపీ నేత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Related News