logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ప్ర‌శాంత్ కిశోర్‌తో జ‌గ‌న్ కొత్త డీల్‌..! కేటీఆర్‌తోనూ పీకే భేటీ..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల‌యాల‌పై దాడులు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న వేళ ఒక కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, సెఫాల‌జిస్ట్, ఐప్యాక్ అధినేత‌ ప్ర‌శాంత్ కిశోర్ భేటీ అయ్యారు. హ‌ఠాత్తుగా ఈ భేటీ జ‌ర‌గ‌డం వెనుక కార‌ణం ఏంట‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల‌కే అంతుచిక్క‌డం లేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల గెలుపు కోసం ప్ర‌శాంత్ కిషోర్ సాయాన్ని జ‌గ‌న్ కోరార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఇవి ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యంగా లేవు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే చాలావ‌ర‌కు వైసీపీకి ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. మిగ‌తా వాటిలోనూ అధికారంలో ఉన్న వైసీపీకి గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. పైగా ప్ర‌శాంత్ కిశోర్ స్థాయి వ్య‌క్తి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ప‌ని చేయ‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో డీఎంకేతో, బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకొని ఉన్నారు. కాబ‌ట్టి, ఏపీ స్థానిక సంస్థ‌ల్లో, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప‌ని చేసేంత తీరిక కూడా ప్ర‌శాంత్ కిశోర్‌కు లేదు.

కాబ‌ట్టి, జ‌గ‌న్‌తో పీకే భేటీ వెనుక కార‌ణం ఇంకేదైనా ఉండొచ్చు అంటున్నారు. మ‌రోసారి ప్ర‌శాంత్ కిశోర్‌కు జ‌గ‌న్ భారీ వ‌ర్క్ ఆర్డ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది. దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌ని ఇటీవ‌ల కేంద్రం సిగ్న‌ల్స్ ఇస్తోంది. 2022 చివ‌ర్లో లేదా 2023 మొద‌ట్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ అసెంబ్లీల ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. కేంద్రం ఈ దిశ‌గానే అడుగులు వేస్తోంది.

దీంతో అనివార్యంగానే అన్ని పార్టీలూ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల్సి ఉంది. అందుకే ప్ర‌శాంత్ కిశోర్ ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిశార‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ భారీ విజ‌యం వెనుక ప్ర‌శాంత్ కిశోర్ బృందం ప‌ని కూడా ఒక ప్ర‌ధాన కార‌ణం. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే జ‌గ‌న్‌కు పెద్ద‌గా స‌మ‌యం ఉండ‌దు. అందుకే మ‌రోసారి ప్ర‌శాంత్ కిశోర్‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా జ‌గ‌న్ నియ‌మించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ రాబిన్ శ‌ర్మ అనే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకుంది. ఆయ‌న ప‌ని కూడా ప్రారంభించారు. దీంతో మ‌రోసారి ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌గ‌న్ డీల్ ఫిక్స్ చేసుకుంన్నార‌ట‌. ఈ చ‌ర్చ‌ల్లో భాగంగానే ప్ర‌శాంత్ కిశోర్ అమ‌రావ‌తికి వ‌చ్చి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశార‌ని చెబుతున్నారు. ఇక జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్‌తో కూడా ప్ర‌శాంత్ కిశోర్ స‌మావేశం అయ్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీఆర్ఎస్ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోలేదు. కేసీఆర్ వ్యూహాలు ఆ పార్టీకి విజ‌యాల‌ను అందించాయి. కానీ, ఇప్పుడు తెలంగాణ‌లో రాజకీయ ప‌రిస్థితులు మారాయి. బీజేపీ రూపంలో టీఆర్ఎస్‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి త‌యార‌వుతోంది. మ‌రోవైపు కాంగ్రెస్ ఎలాగూ ఉంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌కు కూడా ప‌ని చేయాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ భావిస్తున్నారు. అందుకే కేటీఆర్‌ను క‌లిశార‌ని తెలుస్తోంది. అయితే, వీరి మ‌ధ్య డీల్ కుదిరిందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Related News