logo

  BREAKING NEWS

అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |  

క‌రోనాపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక్క రోజుకు ఎంత ఖ‌ర్చు పెడుతుందో తెలుసా..?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొంత ముందుచూపుతోనే వ్య‌వ‌హ‌రిస్తో వ‌స్తోంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్ విధానం ద్వారానే వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని భావిస్తున్న ఏపీ ప్ర‌భుత్వం టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచింది. టెస్టులు చేయ‌డంలోనూ దేశంలోనే ముందంజ‌లో ఉంది. మొబైల్ టెస్టింగ్ సెంట‌ర్ల‌ను సైతం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే సులువుగా ప‌రీక్ష‌లు చేయించుకునే స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పించింది.

ఇక‌, క‌రోనాను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆరోగ్య‌శ్రీలో చేర్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిజిల్లాలో ప్ర‌త్యేక క‌రోనా ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేసింది. అలాగే హోం ఐసొలేష‌న్‌లో ఉంటున్న క‌రోనా బాధితుల‌కు కూడా కిట్‌ల‌ను అందిస్తోంది. ఇలా ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గించేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకు ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు పెడుతోంది. ఒక్క‌రోజుకు 10.18 కోట్ల‌ను ప్ర‌భుత్వం క‌రోనాపై ఖ‌ర్చు పెడుతోంది.

ఇందులో కోవిడ్‌ టెస్టుల కోసమే రూ.4.3 కోట్లు వెచ్చిస్తోంది. ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందుల కోసం రూ.4.57 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ వివ‌రాలు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోవిడ్‌పై జ‌రిపిన స‌మీక్ష‌లో అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయ‌ని, వాటిలో ప్రస్తుతం (శుక్రవారం నాటికి) సాధారణ బెడ్లు 2462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఖాళీగా ఉన్నాయని ప్ర‌భుత్వం చెబుతోంది.

కోవిడ్ కోస‌మే వైద్య సిబ్బందిని ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా నియ‌మించింది. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయ‌గా, రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. వీటిల్లో 4,676 పోస్టులలో నియామకం పూర్తి కాగా, 5,295 పోస్టుల భర్తీ ప్రక్రియ కొన‌సాగుతోంది. అయితే, ఇంత ప్ర‌భుత్వం ఇంత చేస్తున్నా కొన్ని ప‌త్రిక‌లు ప‌నిగ‌ట్టుకొని విష‌పూరిత రాత‌లు రాస్తున్నార‌ని జ‌గ‌న్ జ‌రిపిన స‌మీక్ష‌లో చ‌ర్చ జ‌రిగింది.

Related News