logo

  BREAKING NEWS

ఏపీ సర్కారు శుభవార్త.. పేదలకు రూ.10 వేల ఆర్థిక సాయం !

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త వినిపించింది. పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు జమ చేస్తుంది. ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల రూపాయలను అందజేస్తుంది. కాన్సర్ సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఫించన్లను అందజేస్తుంది.

తాజాగా వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. షాపులున్న నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు జగనన్న చేదోడు పేరుతో ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు ఏపీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా నేడు ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,47,040 లబ్ది దారులకు రూ. 247.04 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది.

Related News