logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన ‘జబర్దస్త్’ బ్యూటీ.. అనసూయకు క్షమాపణలు!

వర్ష పేరుతో ఓ నటి ఇప్పుడు జబర్దస్త్ షోను ఊపేస్తోంది. అనసూయ, రష్మి తర్వాత ఆమె బాగా పాపులర్ అయ్యేలా కనిపిస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు వర్ష పాత వీడియోలను ఇప్పుడు బయటపెట్టారు. అందులో వర్ష అనసూయను ‘నువ్వసలు తల్లివేనా’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టేస్తుంది. ఈ వీడియో ఎప్పటిదో తేల్చుకోలేకపోతున్నారు కొంతమంది ఆడియన్స్.

అయితే అనసూయపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో చివరకు వర్ష అనసూయకు క్షమాపణలు చెబుతూ తాజాగా ఇంకో వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. గతంలో అనసూయ ఓ పిల్లాడి ఫోన్ ను విసిరేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై స్పందిస్తూ వర్ష అనసూయను చెడా మడా తిట్టేస్తుంది. నీ పిల్లలు కూడా ఓ స్టార్ హీరోతో సెల్ఫీ కోసం వెళితే అతను ఆ ఫోన్ విసిరేస్తే అప్పుడు నీకు ఆ తల్లి బాధ తెలుస్తుంది. అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చింది.

అయితే కొన్ని రోజులకే వర్షకు తన తప్పు అర్థం అయ్యిందట. అందుకే అనసూయ రంగస్థలం షూటింగ్ లో ఉన్న సమయంలో ఆమెను కలిసి క్షమాపణలు కూడా చెప్పిందట. అందుకు అనసూయ కూడా నీకు నా గురించి తెలియక అన్నావ్.. పరవాలేదులే అంటూ కూల్ అయ్యిందట. అంతే కాదు అనసూయ వ్యక్తిత్వం చాలా మంచిదని తనతో పాటుగా చాలా మందికి ఆమె సాయం చేసిందని తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పింది వర్ష. నెటిజన్ల దెబ్బకు అనసూయకు రెండోసారి క్షమాపణలు చెప్పుకోవాల్సొచ్చిందీ బ్యూటీ.

Related News