logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

తెలుగు రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద‌ కార్య‌క‌లాపాలు

ఉగ్ర‌వాదానికి సంబంధించి ఓ సంచ‌ల‌న విష‌యం ఎన్ఐఏ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. భార‌త్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ఉన్న‌ట్లు ఎన్ఐఏ విచార‌ణ‌లో తేలింద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్య‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు ఆయ‌న ఈ మేర‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 15 రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ఉన్న‌ట్లు కిష‌న్ రెడ్డి తెలిపారు.

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఉన్నాయి. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, రాజ‌స్థాన్‌, బిహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఇస్లామిక్ స్టేట్ కార్య‌క‌లాపాలు ఉన్న‌ట్లు ఎన్ఐఏ విచార‌ణ‌లో తేలింద‌ని కిష‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ సంస్థ‌లో ప‌లువురు మ‌న దేశానికి చెందిన కొంద‌రు కూడా చేరిన‌ట్లు విచార‌ణ సంస్థ‌ల‌కు ఆధారాలు ల‌భించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈ సంస్థ త‌మ ఉగ్ర‌వాద భావ‌జాలాన్ని ప్ర‌చారం చేసుకునేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను వాడుకుంటోంద‌ని, అందుకే ఇంట‌ర్నెట్ వినియోగంపై మ‌న విచార‌ణ సంస్థ‌లు నిఘా పెట్టి ఉన్నాయ‌ని తెలిపారు. కాగా, ప్ర‌పంచంలో ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌మాద‌క‌ర సంస్థగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా చేయాల‌నే ల‌క్ష్యంతో ఈ సంస్థ రక్త‌పాతాన్ని సృష్టిస్తోంది.

Related News