logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రాత్రి పూట అన్నానికి బదులు చపాతీలు తింటే బరువు తగ్గుతారా?

బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో అనేక మార్పులు చేసుకుంటుంటారు. ఫ్యాట్ ను కలుగజేసే పదార్థాలను పూర్తిగా దూరం పెడతారు. వీరి డైట్ లోముఖ్యమైనది చపాతీలు. రాత్రి భోజనంలో అన్నానికి బదులు గోధుమ పిండితో చేసిన చపాతీలు తినడం అలవాటు చేసుకుంటారు. ఇలా అన్నానికి బదులు చపాతీలు తినడం వలన నిజంగానే ఫలితం ఉంటుందా? అనుకున్నంత బరువు తగ్గుతారా? అనే విషయాలు తెలుసుకుందాం..

భారతీయ ఆహారంలో, ప్రధాన పిండి పదార్ధాలు బియ్యం, గోధుమలు. మనం తీసుకునే అనంలోనూ, చపాతీల్లోనూ శరీర బరువుకు తోడ్పడే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారు కార్బో హైడ్రేట్స్ ను తక్కువగా ప్రోటీన్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది బరువుతగ్గిపోవడానికి కారణం వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటమే.

కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి శరీరంలో సోడియంను తొలగించడానికి చపాతీలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. బరువు తగ్గడానికి కూడా చపాతీలు చక్కటి పరిష్కారం. ఎందుకంటే చపాతీలతో పోలిస్తే అన్నంలో అధిక క్యాలరీలు ఉంటాయి. అన్నం కంటే చపాతీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్‌ ఉండటం వల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి.

గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. కానీ బరువు తగ్గాలనుకునే చపాతీలో తినేవారు మాత్రం ఎంత పరిమాణంలో తీసుకోవాలనే విషయంపై శ్రద్ధ వహించాలి. బరువు తగ్గడానికి గరిష్టంగా రోజుకి నాలుగు చపాతీలు మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తినకూడదు. అది కూడా రాత్రి 7: 30 గంటల లోపు వారి భోజనాన్ని ముగించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వారి అన్నం అయినా చపాతీలు అయినా మీ శరీరానికి ఏది మంచిదో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.

Related News