ఉన్నట్లుండి మీ అడుగులు బరువుగా పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయా? పాదాల్లో వాపు లక్షణాలు కనిపిస్తున్నాయా? మామూలుగా అయితే గర్భిణీ స్త్రీలలో పాదాల్లో వాపు కనిపిస్తుంది. దీనికి ఒకే దగ్గర కూర్చుని పని చేయడం ఒక కారణం కావచ్చు. కానీ కొందరిలో ఏమి చేసినా చెయ్యపోయినా ఈ సమస్య కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏమిటి? దీని వలన ప్రమాదమెంత? అనే విషయాలు చూద్దాం..
కారణాలు:
పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ గంటలు కూర్చును పని చేసే వారికి, వెరికోసీల్ వెయిన్స్ సమస్య ఉన్న వారికి ఇలా జరుగుతుంది. ఈ వాపు ఒక దశలో తీవ్ర మైన నొప్పికి దారి తీస్తుంది. చర్మం రంగు మారుతుంటుంది. సాధారణంగా కనిపించే వాపులో చేతితో ఆ భాగాన్ని నొక్కినప్పుడు వాపు ఉన్న భాగంలో నొక్కినప్పుడు వెంటనే ఆ భాగం తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంది. కానీ వేలితో నొక్కినా ప్రాంతంలో గుంటలాగా పడి కొద్దీ క్షణాల వరకు ఆ భాగం లోపలికి అలాగే ఉంటె అది తీవ్రమైన సమస్యగా భావించాలి. గుండె, కిడ్నీ, కాలే య భాగాల్లో ఏదైనా సమస్య ఉన్నటుగా అనుమానించాలి.
లేదా హైపోథైరాయిడిజం ఉన్నట్లు కూడా అనుకోవచ్చు. పాదాల్లో ఈ వాపు చాలా అరుదుగా మాత్రమే వస్తూ దానికదే తగ్గిపోతూ ఉంటే, కొద్ది కాలం విశ్రాంతి తీసుకుంటే ఆ సమస్య పూర్తిగా తొలగిపోవచ్చు. విశ్రాంతి తర్వాత కూడా వాపు తగ్గకపోగా, ఆకలి తగ్గడం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం లేదా, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
సాధారణ వాపు ప్రక్రియే అయితే మాత్రం ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవాల్సి వచ్చినప్పుడు పదాలను వెళ్లాడదీయకండి. అది వాపును కలిగిస్తుంది. పదాలను కొంచెం ఎత్తులో ఉంచి కూర్చోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. పాదాలు వాపు ఎక్కువగా ఉన్నప్పుడు పాదాల కింద దిండు పెట్టుకోండి. లేదంటే కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంటే పాదాలను కుషన్ మీద పెట్టుకోవడం మంచిది.
ఎక్కువ సేపు నిల్చున్నా, ఎక్కువ సేపు కూర్చున్నా కూడా కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. అలా కాకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోండి.
ఎంత పనిలో ఉన్నా, వాతావరణం చల్లగా ఉన్నా నీటిని తాగడం మర్చిపోవద్దు. శరీరానికి అవసరమైన నీటి శాతం అందించాలి. అది పాదాల వాపును తగ్గిస్తుంది. పదాలను ఉప్పు నీటిలో కాసేపు ఉంచి విశ్రాంతి తీసుకున్న కూడా వాపు తగ్గుతుంది. పాదాల వాపుకు రక్తప్రసరణ లేకపోవడం ఒక కారణమైతే మెగ్నీషియం లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. అందుకే జీడిపప్పు, బాదం పప్పు, అవకాడో, పాలకూర, డార్క్ చాక్లెట్ బ్రకోలి వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉన్న లభించే ఆహారం తీసుకోవాలి.