logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

‘ఆర్ఆర్ఆర్’ టీంకు షాకిచ్చిన నటి.. పండగ చేసుకుంటున్న అభిమానులు!

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే తెరపై సందడి చేయనున్నారు. మెగా, నందమూరి హీరోలతో దర్శకుడు రాజమౌళి ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబందించిన వివరాలను సినిమా టీమ్ చాలా గోప్యంగా ఉంచుతూ వస్తుంది. కానీ ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్ నటి అలిసన్‌ డూడీ చేసిన ఓ పోస్ట్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఇటీవల ఓ పోస్ట్ చేస్తూ అందులో ఆర్ఆర్ఆర్ ను ట్యాగ్ చేసింది. ఆ పోస్టులో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ అక్టోబర్ 8 అని ప్రకటించింది. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ గా మారింది.

పొరపాటు గ్రహించిన నటి వెంటనే ఆ ఆపోస్టు ను డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోస్టును స్క్రీన్ షాట్ తీసిన ఆర్ఆర్ఆర్ అభిమానులు దానిని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. ఆమె చేసిన ఈ పనికి సినిమా టీమ్ ను షాక్ కు గురిచేసింది. కానీ ఇంత పెద్ద అప్ డేట్ ఇచ్చినందుకు అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

Related News