logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

తండ్రి ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమాయణం.. షాకిచ్చిన స్టార్ హీరో కుమార్తె!

తన తండ్రికి పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్న వ్యక్తి తో ప్రేమాయణం కారణంగా ఓ స్టార్ హీరో కుమార్తె ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్. బాలీవుడ్ లో సెలబ్రిటీలకు ఫిట్ నెస్ పాఠాలు చెప్పే నుపూర్ శిఖరే అమిర్ ఖాన్ కు కొంతకాలంగా ట్రైనర్ గా ఉంటున్నాడు.

అమిర్ కూతురు ఇరా మిశాల్ అనే వ్యక్తితో రెండేళ్ల పాటు ప్రేమలో ఉంది 2019లో విడిపోయింది. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఆమె తన ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టింది. దీంతో తండ్రి ట్రైనర్ అయిన నుపూర్ ఇరాకు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టుగా సమాచారం. అతని వ్యక్తిత్వం బాగా నచ్చడంతో ఇప్పుడు వీరు డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాదు మహాబలేశ్వరంలో అమిర్ ఖాన్ కు ఓ ఫామ్ హౌస్ ఉంది.

ఈ ఇంట్లో వీరిద్దరూ తమ స్నేహతులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు., అందుకు సంబందించిన ఫోటోలు ఇరా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్తలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాను నాలుగేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నానని ఇరా ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Related News