logo

  BREAKING NEWS

బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |  

ఐపీఎల్ 20202 కి సిద్ధంగా ఉండండి: గంగూలీ

కరోనా కారణంగా అక్టోబర్ 18 నంచి నవంబర్ 15 వరకు జరగవలసిన టీ 20 ప్రపంచ కప్ పై అనిశ్చితి కొనసాగుతూ వస్తుంది. కరోనా లాక్ డౌన్ వల్ల ఈ టోర్నీ వాయిదా పడవచ్చని అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఐసీసీ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. తాజాగా ఐసీసీ నిర్వహించిన బోర్డు సమావేశంలో జూలైలోనే వరల్డ్ కప్ పై నిర్ణయం ఉంటుందని తెలిపింది.

తాజాగా ఐసీసీ ప్రకటించిన నిర్ణయంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020 ని నిర్వహించాలని భర్త క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయిచింది. టీ20 జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్ ను నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనలో బీసిసిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లకు బీసిసిఐ అశ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ లేఖ రాసాడు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగిన వెంటనే ఐపీఎల్ నిర్వహించడానికి అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించవచ్చు. ఐపీఎల్ కోసం అభిమానులు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర క్రికెట్ బోర్డులు అందుకు సిద్ధంగా ఉండాలని గంగూలీ తన లేఖ ద్వారా తెలిపారు. సాధ్యమైనంత తొందర్లో ఐపీఎల్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Related News