logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |  

ఇలాంటి మాస్కులు వేసుకున్నా లాభం లేదట.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ లోకి రావడంతో భౌతిక దూరం, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కొందరు. ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మాస్కులు ధరించడం పై ఓ సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సరైన పద్దతిలో మాస్కులు ధరించకుంటే వాటిని వేసుకున్నా కరోనా నుంచి రక్షణ ఉండకపోవచ్చని తెలిపింది.

బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, షాన్ డియాగో, యునివర్సిటీ ఆఫ్ టొరంటో సంయుక్తంగా చేపట్టిన సర్వేలో మాస్కులకు సంబందించిన కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి దగ్గినప్పుడు విడుదలయ్యే తుంపర్ల పరిమాణం సాధారణంగా 200 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇవి మాస్కు నుంచి బయటకు చొచ్చుకు వచ్చి చిన్న చిన్న బిందువులుగా మారాతాయి.

వీటినే ఏరోసాల్స్ అంటారు. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచేందుకు సహాయపడతాయి. ఆ సమయంలో ఎదుటి వ్యక్తికి కూడా కరోనా సోకవచ్చు. ఈ చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు మూడు లేయర్లతో తయారు చేసిన మాస్కులను వాడాలని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రయోగానికి డ్రాప్ లెట్ జనరేటర్, హై స్పీడ్ కెమెరాలను ఉంచి పరిశీలించారు.

ఒకటి, రెండు పొరల మాస్కులు ధరించిన వారి నుండి వచ్చే తుంపర్లు 100 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. అంటే అవి చాలా సులభంగా ఇతరులకు వైరస్ ను వ్యాప్తి చేయగలవు. అందువల్ల సాధారణ సమయంలో ఒకటి, రెండు పొరలు ఉన్న మాస్కు ధరిస్తే సరిపోతుందని.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కచ్చితంగా మూడు పొరల మాస్కు ధరించాలని వారు సూచిస్తున్నారు.

Related News