logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

రుద్రాక్షల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రుద్రాక్ష గురించి తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. హిందూ మతంలో రుద్రాక్షలకు ఎంతో విశిష్టత ఉంది. రుద్రాక్ష చుట్టూ ప్రపంచంలోనే ప్రాచీనమైన వృక్షాలలో ఒకటి. పురాణ గాథల ప్రకారం.. రుద్రాక్షలను శివుడి అన్నిటి బొట్లుగా చెప్తారు. రుద్రుడు అంటే శివుడు రాక్షసులతో పోరాడి కొన్ని ప్రాంతాలని భస్మం చేస్తాడు. ఆ సమయంలో మరణించిన వారిని చూసి విచారిస్తాడు. అలా ఆయన కన్నీటి బొట్లే భూమి మీద పడి రుద్రాక్షలుగా మారాయని అంటారు. అందుకే రుద్రాక్షలను శివుడి రూపాలుగా భావించి పూజిస్తారు. ఒక్కో ముఖాన్ని ధరించడం వలన ఒక్కో ప్రయోజనం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరడానికి, పనిలో ఆటంకాలు తొలగడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి వీటిని ధరిస్తారు. ఈ విధంగా ఎలాంటి రుద్రాక్షను ధరిస్తే ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..

ఏక ముఖి రుద్రాక్ష అత్యంత శక్తివంతమైనది. దీనిని శివుడి రూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి జీవితంలో ఎలాంటి కొరత ఉండదు. సంపదతో పాటుగా జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం లభిస్తాయి.ఏకముఖి రుద్రాక్ష అన్ని పాపాలు హరిస్తుంది. అయితే ఏకముఖిని ధరించిన వారు 12 రోజులలో కుటుంబాన్ని వదిలిపెడతారని అంటారు. అందుకు కారణం దీనిలో ఉండే కొన్ని శక్తులు దీనిని ధరించిన వారిని ఏకాంతంగా ఉండే విధంగా చేస్తాయట.

వైవాహిక జీవితం బాగుండాలని కోరుకునే వారు ద్విముఖి రుద్రాక్షలను ధరించాలి. అంటే రెండు ముఖాలు ఉన్నవి. ఈ రుద్రాక్షను శివ పార్వతుల అర్థనారీశ్వరీ తత్వానికి సంకేతంగా నమ్ముతారు. సౌభాగ్యాన్ని ప్రసాదించి చెడు ఆలోచనను రాకుండా నివారిస్తుంది.

తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారు త్రిముఖి రుద్రాక్షను అంటే మూడు ముఖములు ఉన్న దానికి ధరించాలి. చతుర్ముఖి రుద్రాక్షను పాలలో వేసి ఉంచి ఆ పాలను తాగడం వలన మానసిక రోగాలు నయమవుతాయి. నరాల సంబంధిత వ్యాధులను తగ్గించి, జ్ఞాపక శక్తిని, తెలివి తేటలను పెంచుతుంది. పంచముఖి రుద్రాక్షను పిల్లలు స్త్రీలు ఎవరైనా ధరించవచ్చు. గుండె జబ్బులు, రక్తపోటు, షుగరు వ్యాధి ఉన్నవారికి మంచిది. కోపాన్ని అదుపు చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

షట్ముఖి రుద్రాక్షని కుడి చేతికి ధరిస్తే లోబీపీ తగ్గుతుంది. రక్తపోటు, హిస్టీరియా కూడా దూరమవుతాయి. సప్తముఖి రుద్రాక్షను ధరించిన వారికి అకాల మరణం సంభవించిందని నమ్మకం. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి రక్షణ లభించడానికి అష్ట ముఖి రుద్రాక్షను ధరించాలి. ఎడమ చేతికి నవముఖి రుద్రాక్షను ధరిస్తే వివాహ సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

స్త్రీలు ఎక్కువగా ధరించే దశ ముఖి రుద్రాక్ష వల్ల నరాల సంబంధిత వ్యాధులు నయమవుతాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. సంతాన సమస్యల వల్ల బాధపడేవారు ఏకాదశముకి రుద్రాక్షను ధరించాలి. శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ద్వాదశముఖి రుద్రాక్ష మంచిది. శారీరక అందం కోరుకున్నవారు త్రయోదశముఖి అంటే 13 ముఖాలు ఉన్న రుద్రాక్షను పాలలో వేసి ఆ పాలను తాగితే సౌందర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో కనబడతారు.

Related News