హీరోయిన్లంటే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారని ఆ తర్వాత ఆఫర్లు తగ్గితే ఏ బిజినెస్ మ్యాన్నో పెళ్లి చేసుకుని చెక్కేస్తారనే టాక్ ఉంది. కానీ అలనాటి తార రాశి మాత్రం అందుకు పూర్తి భిన్నం. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే రాశి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కెరీర్ కు దూరమయ్యారు.
అయితే ఆమె పెళ్లి చేసుకుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన రాశి 90 దశకాల్లో తన అందాలతో కుర్రకారును ఓ ఊపు ఊపింది. పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, మనసిచ్చిచూడు, స్వప్నలోకం, ప్రేయసి రావే వంటి సినిమాలతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో రాశిని పెళ్లి చేసుకోవడానికి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని బిజినెస్ మ్యాన్ లు వచ్చారట.
కానీ వారి ప్రపోజల్స్ ను రాశి సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం అప్పటికే ఆమె శ్రీ ముని అనే అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో ఉంది. రాశి నటించిన అనేక సినిమాలకు శ్రీ ముని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కొంత కాలానికే రాశి తండ్రి మరణించారు. నిజానికి రాశి ఆయన తండ్రి కోరిక మేరకే హీరోయిన్ గా మారారు.
తండ్రి మరణంతో కుమిలిపోయిన రాశికి శ్రీముని రూపంలో ఓదార్పు లభించింది. ఒక రోజు తనను పెళ్లి చేసుకోవాలని రాశి అతన్ని కోరింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోయినా చాలా కష్టపడి మరీ ఒప్పించి చివరికి ఒకటయ్యారు. ప్రస్తతం వారిద్దరికీ ఒక పాప. ఇటీవల రాశి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.కొన్ని సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి తన అబిమానులకు మరింత దగ్గరయ్యారు రాశి.