టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే 59 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం అదృశ్యమైంది. ఇండోనేషియాలో శ్రీవిజయ సంస్థకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్ బోయింగ్-737 బయలుదేరిన కొద్ది సేపటికే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులతో సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారు.
అప్రమత్తమైన అధికారులు విమానం ఆచూకీ కనిపెట్టేందుకు రాడార్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. జకర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోన్‌టియానక్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన సమయంలో 10 వేల అడుగులో విమానం ప్రయాణిస్తుందని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్లడించింది.