టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన వడ్డే రమేష్ వారసుడిగా పరిచయమయ్యారు హీరో వడ్డే నవీన్. ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఆయన మొదటి సినిమా. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి’ సినిమా వడ్డే నవీన్ కెరీర్ ను మలుపు తిప్పింది.
సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొంది ఫ్యామిలీ హీరోగానూ లవర్ బాయ్ గాను ఫేమ్ తెచ్చుకున్నాడు. మా బాలాజీ, మానసిచ్చి చూడు, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో స్టార్ డం తెచ్చుకున్నాడు. అయితే సినీపరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎంత త్వరగా హీరోగా నిలదొక్కుకున్నాడో అంతే త్వరగా కెరీర్ లో డౌన్ ఫాల్ చూసాడు ఈ హీరో.
ప్లాపుల కారణంగా హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. వడ్డే నవీన్ చివరగా మనోజ్ నటించిన ‘అటాక్’ సినిమాలో కనిపించాడు. వడ్డే నవీన్ చాలా మందికి అభిమాన హీరో అయినా ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. నిజానికి వడ్డే నవీన్ నందమూరి ఇంటల్లుడు. ఆయన తండ్రి రమేష్ కు నందమూరి కుటుంబానికి మంచి సంబంధాలు ఉండటంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కుమార్తె చాముండేశ్వరిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకో మహిళను వడ్డే నవీన్ పెళ్లాడారు.