టాలీవుడ్ లో ఇప్పుడు యువ తరాన్ని ఆకట్టుకుంటున్న మేల్ సింగర్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు సిడ్ శ్రీరామ్ పేరే. ఇతను ఏ పాట పాడినా అది సూపర్ హిట్టే. ఈ సింగర్ పాట సినిమాలో ఉందంటే ఆ సినిమాకు మరికొన్ని ఎక్స్ ట్రా టికెట్స్ తెగినట్టే అనే టాక్ ఉంది. ఇక శ్రీరామ్ కు ఉన్న అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ తాజాగా తాజాగా చేసుకున్న ఓ ఘటన శ్రీరామ్ ఫాన్స్ తో పాటుగా మ్యూజిక్ లవర్స్ ను బాగా కలవరపెట్టింది. హైద్రాబాద్ లో ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్ కు ఘోర అవమానం జరిగింది.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లోని సన్ బర్న్ పబ్లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కు సిడ్ హాజరయ్యాడు. ఇతని పేరు చెప్పుకుని ఈవెంట్ మేనేజర్లు షో టికెట్లను అడ్డగోలుగా అమ్మేసారు. దీంతో కేవలం 500 మందికి మాత్రమే సరిపోయే హాల్ లో ఈ ప్రోగ్రామ్ కి వందలాది మంది తరలివచ్చారు. ప్రోగ్రామ్ జరుగుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు సిడ్ పై నీళ్లు, మద్యం చల్లుతూ ఇబ్బంది పెట్టారు. అయినా ఇలాంటి వాటికి భయపడేది లేదంటి సిడ్ తన ప్రోగ్రాం ను అలాగే కొనసాగించారు.
అప్పటికీ వారు ఆగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేశారు కొందరు సభ్యులు. అయితే ఈ ఘటనలో ఎక్సయిజ్ పోలీసులు, పబ్ నిర్వాహకులపై సిడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ టైం లో పబ్ లో సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారన్న కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయం దాటవేశారని వారిపై విమర్శలు వస్తున్నాయి.
ఈ ఈవెంట్ తర్వాత తనకు ఎదురైన సంఘటనను సిడ్ శ్రీరామ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మనసును అదుపులో పెట్టుకుంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు ఈ విషయంపై ఎలాంటి కంప్లైంట్ రాలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.