logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఇండియా వైర‌స్ చైనా, ఇట‌లీ వైర‌స్ కంటే ప్రాణాంత‌కం

నేపాల్ ప్ర‌ధానమంత్రి కేపీ శ‌ర్మ ఓలీ త‌న దేశంలో కరోనా వైర‌స్ వ్యాప్తికి భార‌త్‌పై నేపం నెట్టేశారు. భార‌త్ నుంచి త‌మ దేశానికి అక్ర‌మంగా వ‌స్తున్న వారి వ‌ల్లే క‌రోనా వ్యాపిస్తోంద‌ని ఆయ‌న ఆ దేశ పార్ల‌మెంటులో ప్ర‌క‌టించారు. భార‌త్ నుంచి వ‌స్తున్న వారిని స‌రైన ప‌రీక్ష‌లు చేయ‌కుండానే దేశంలోకి రానిస్తున్నార‌ని, ఇందుకు ప‌లువురు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

భార‌త్ నుంచి వ‌స్తున్న వైర‌స్ చైనా, ఇట‌లీ నుంచి వ‌చ్చే వైర‌స్ కంటే ప్రాణాంత‌క‌మైన‌ద‌ని కేపీ శ‌ర్మ ఓలీ చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించి ఓ లెక్కా, ప‌త్రం మాత్రం ఆయ‌న వ‌ద్ద ఏమీ లేదు. మ‌రోవైపు భార‌త్‌కు చెందిన కాలాపానీ, లింపియాధుర‌, లిపీలేఖ్ త‌మ‌వే అంటూ నేపాల్ ప్ర‌ధాని ప్ర‌కటించారు. ఈ ప్రాంతాల‌ను దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల ద్వారా స్వాదీనం చేసుకుంటామ‌ని చెప్పారు. కాగా, నేపాల్‌తో మ‌న దేశానికి 18,00 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు ఉన్న విష‌యం తెలిసిందే.

Related News