logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

చైనా మేజ‌ర్ మూతి ప‌గ‌ల‌గొట్టిన భార‌త యువ‌ లెఫ్టినెంట్‌

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులో స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్నాయి. స‌రిహ‌ద్దు వివాదంలో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణలు జ‌రుగుతున్నాయి. శ‌నివారం ఉద‌యం కూడా ఉత్త‌ర సిక్కింలోని న‌కులా వ‌ద్ద రెండు దేశాల సైనికుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఇరువైపులా ప‌లువురు సైనికులు గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. రెండు వైపులా 150 మంది సైనికులు నిరాయుధులుగా గొడ‌వ ప‌డ్డారు. త‌ర్వాత రెండు దేశాల సైనికాధికారులు స‌మావేశ‌మ‌వ‌డంతో ఈ గొడ‌వ తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. శ‌నివారం ఉద‌యం స‌రిహ‌ద్దులో రెండు దేశాల సైనికుల మ‌ధ్య స‌రిహ‌ద్దు విష‌యంలో గొడ‌వ జ‌రుగుతుండ‌గా మ‌న దేశానికి చెందిన ఓ సైనిక కెప్టెన్‌పై చైనాకు చెందిన ఆర్మీ మేజ‌ర్ అర‌వ‌డం ప్రారంభించారు. సిక్కిం మాదేన‌ని, భార‌త్ అక్ర‌మంగా వ‌చ్చింద‌ని అరుస్తుండ‌గా ఊహించ‌ని విధంగా భార‌త సైన్యంలోని ఓ యువ లెఫ్టినెంట్ ఆగ్ర‌హంతో చైనా మేజ‌ర్ మూతిపై ఒక్క పంచ్ కొట్టాడు.

దీంతో స‌ద‌రు చైనా మేజ‌ర్ కింద ప‌డిపోయాడు. అత‌డి మూతి ప‌గిలి ర‌క్తం వ‌చ్చింది. ఆయ‌న నేమ్ ట్యాగ్ కూడా ప‌డిపోయింది. ఇంకా ఆగ్ర‌హం చ‌ల్లార‌ని మ‌న లెఫ్టినెంట్‌ను తోటి సైనికులు వెన‌క్కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న చైనా సైన్యానికి చాలా సేపు వ‌ర‌కు మింగుడు ప‌డ‌లేద‌ట‌. చైనా మేజ‌ర్‌పైన దాడి చేసిన లెఫ్టినెంట్ సైన్యంలో చేరి రెండేళ్లు కూడా కాలేదు. అయితే ఇలా అవ‌త‌లి వైపు పెద్ద సైన్యాధికారిని ఇలా కొట్ట‌డం వ‌ల్ల రెచ్చ‌‌గొట్టిన‌ట్లు అవుతుంద‌ని మ‌న సైన్యాధికారులు లెఫ్టినెంట్‌ను మంద‌లించి, అత‌డి క‌మిట్‌మెంట్ చూసి ప్ర‌శంసించార‌ట‌.

అంతేకాదు, ఆయ‌న కుటుంబానికి దేశంపైన ఉన్న ప్రేమ ఆ కుటుంబ చ‌రిత్ర చూస్తే ఆర్థ‌మ‌వుతుంది. స‌ద‌రు యువ లెఫ్టినెంట్ తండ్రి కూడా ఆర్మీలో కెప్టెన్ హోదాలో ప‌ని చేశారు. 1986లో ఆరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆయ‌న స‌రిహ‌ద్దు ప‌హారాలో ఉండ‌గా ఇటువంటి ఘ‌ట‌నే జ‌ర‌గ‌గా అప్పుడు ఆయ‌న కూడా చైనా సైనికాధికారిపై పిడిగుద్దులు కురిపించార‌ట‌. ఇక‌, ఆయ‌న తండ్రి కూడా భార‌త వాయుసేన‌లో సేవ‌లందించి రిటైర్ అయ్యారు.

Related News