logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

చైనాపై భారత్ వ్యూహం.. పబ్జీ సహా మరో 47 యాప్ ల బ్యాన్?

చైనాకు చెందిన 59 యాప్ లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం ఆ దేశానికి ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. భారత్ – చైనా ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరో 47 చైనా యాప్ లను కేంద్రం నిషేధిస్తున్నట్టుగా సమాచారం. జాతీయ భద్రతకు ముప్పున్న మొత్తం 280 యాప్ లను కేంద్రం పరిశీలిస్తుంది.

కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే వీటిపై నిఘా ఉంచిందని.. అందులో చైనాలో సర్వర్లు ఉన్న 47 యాప్ లను కేంద్రం బ్యాన్ చేయనుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయా యాప్ ల ద్వారా డేటా ఏ విధంగా మారుతుంది అనే సమాచారాన్ని సేకరిస్తుంది. కాగా భారత ప్రభుత్వం నిషేదిస్తున్న యాప్ లలో పాపులర్ గేమ్ అయిన పబ్జీ కూడా ఉండటం విశేషం. దీంతో పాటుగా లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే అందుకు సంబందించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే చైనా మూలాలున్న 59 యాప్ లపై భారత్ నిషేధం విధించడంతో చైనాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ఆ దేశం స్వయంగా అంగీకరించింది. అయినా సరిహద్దుల్లో మాత్రం చైనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే భారత్ నిషేధానికి గురైన కొన్ని యాప్ లు చైనా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి వెనకడుగు వేస్తున్నాయి. అందుకోసం అమెరికా వంటి అగ్ర దేశాలతో ఒప్పందాలు చేసుకుని మరోసారి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కాగా చైనాతో భారత సైనికుల మధ్య చెలరేగిన ఉద్రికతల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 22 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

Related News