logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భారతీయ వైద్యుడి ఉన్మాదం.. మహిళా వైద్యురాలిని నిర్బంధించి దారుణం!

అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారతీయ వైద్యుడి ఉన్మాదానికి ఓ మహిళా వైద్యురాలు బలైంది. టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్న నారుమంచి భరత్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల అతనికి క్యాన్సర్ సోకిందని మరికొన్ని వారాలు మాత్రమే బతకగలడని నిర్థారించారు.

అప్పటి నుంచి తీవ్ర నిరాశలో ఉన్న భారత్ కుమార్.. ఆస్టిన్ లోని చిల్ట్రన్స్ మెడికల్ గ్రూపు ఆసుపత్రిలో స్వచ్ఛందంగా పని చేస్తానని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అతని దరఖాస్తును ఆసుపత్రి వర్గాలు తిరస్కరించారు. ఇదిలా ఉండగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆస్టిన్ లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలోకి అక్రమంగా ప్రవేశించాడు.

తనతో పాటుగా రెండు పెద్ద బ్యాగులు ఒక తుపాకిని తీసుకుని వెళ్ళాడు. ఆసుపత్రిలో ఉన్న ఐదుగురు వైద్యులను బెదిరించి నిర్బంధించాడు. అనంతరం నలుగురిని వదిలి పెట్టి 43 ఏళ్ల కేథరిన్ లిండ్లే డాడ్సన్ మాత్రం నిర్బంధించాడు. ఆ తర్వాత ఆమెను గన్ తో కాల్చి చంపాడు. దాదాపు ఆరు గంటల పటు ఆసుపత్రిలో భీభత్సం సృష్టించాడు. అనంతరం అతను కూడా అదే తుపాకితో కాల్చుకుని మరణించాడు.

కాగా మహిళా వైద్యురాలిని ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆ ఆసుపత్రితో గాని మృతురాలితో గాని భరత్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై భరత్ కుమార్ తల్లిదండ్రులు స్పందిస్తూ… తమ కుమారుడు ఇలా ఎందుకు చేసాడో తెలియడం లేదని వాపోయారు. ఈ ఘటన తమను జీవితాంతం వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

Related News