logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

టిక్ టాక్‌కు పోటీగా ఇండియ‌న్ యాప్‌.. అప్పుడే 50 ల‌క్ష‌ల యూజ‌ర్లు

మ‌న దేశంలో టిక్ టాక్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అన్ని వ‌య‌స్సుల వారు, అన్ని వృత్తుల వారు టిక్ టాక్ యాప్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. కొంద‌రైతే టిక్ టాక్‌కు బానిస‌లు అయిపోతున్నారు. మ‌రికొంద‌రైతే టిక్ టాక్ మోజులో ప‌డి ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇంత‌లా టిక్ టాక్‌లు మ‌నవాళ్లు అల‌వాటు ప‌డి పోయారు. దీంతో అన‌తి కాలంలోనే ఎక్కువ ఆద‌ర‌ణ పొందిన యాప్‌గా టిక్ టాక్ రికార్డు సృష్టించింది.

అయితే, ఎంత వేగంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిందో అంతే వేగంగా టిక్‌టాక్ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. బైట్ డ్యాన్స్ అనే చైనా కంపెనీ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్ర‌స్తుతం దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేమ‌స్ యాప్‌గా ఇది మార‌డంతో కోట్ల‌తో ఆదాయం ల‌భిస్తోంది. అయితే, టిక్ టాక్‌పై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు, వివాదాస్ప‌ద అంశాలు, మ‌హిళ‌లు, చిన్నారులు, మూగ‌జీవాల‌పై దాడులను ప్రోత్స‌హించేలా వీడియోలు వ‌స్తున్నాయి. ఒక్కోసారి ఇటువంటి వీడియోలు తీవ్ర వివాదాస్ప‌దమ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే గ‌తంలో ఓ సారి మ‌ద్రాస్ హైకోర్టు టిక్ టాక్‌ను బ్యాన్ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది. త‌ర్వాత యాప్‌లో మార్పులు చేశామ‌ని, ఇక నుంచి అటువంటి వీడియోలు లేకుండా చూసుకుంటామ‌ని టిక్ టాక్ త‌ప్పించుకుంది. ఇప్పుడు కూడా టిక్ టాక్‌లో మార్పు ఏమీ రాలేద‌ని, ఇటీవ‌ల మ‌హిళ‌ల‌పై యాసిడ్ దాడులు ప్రోత్స‌హించేలా వీడియోలు టిక్ టాక్‌లో వైర‌ల్ అయ్యాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ వ్య‌వ‌హారంపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ కూడా స్పందించి టిక్ టాక్‌ను బ్యాన్ చేయాల‌ని కేంద్రాన్ని కోరారు.

మ‌రోవైపు క‌రోనా వైర‌స్, ఇటీవ‌ల భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు వివాదాల నేప‌థ్యంలో మ‌న నెటిజ‌న్లు చైనా ప‌ట్ల నిర‌స‌న తెలుపుతున్నారు. చైనీస్ ప్రోడ‌క్ట్స్‌ను వాడ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. టిక్ టాక్ కూడా చైనాదే కావ‌డంతో టిక్ టాక్ ను కూడా బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బ్యాన్ టిక్ టాక్‌, అన్ఇన్‌స్టాల్ టిక్ టాక్ అనే నినాదాలు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌కు ప్లేస్టోర్‌లో నెగ‌టీవ్ రేటింగ్‌, రివ్యూలు ఇవ్వ‌డంతో టిక్ టాక్ రేకింగ్ పేక‌మేడ‌లా ఒక్కసారిగా కుప్ప‌కూలింది.

ఇదంతా ప‌క్క‌న‌పెడితే టిక్‌టాక్‌కు పోటీగా స్వ‌దేశీ యాప్‌ను తీసుకువ‌చ్చారు ఐఐటీ రూర్కీ విద్యార్థ శివాంక్ అగ‌ర్వాల్‌. అచ్చం టిక్ టాక్ త‌ర‌హాలోనే మిత్రో అనే యాప్‌ను రూపొందించారు. మిత్రో అంటే హిందీలో స్నేహితులు అని అర్థం. మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా త‌ర ప్ర‌సంగాల్లో ప్ర‌జ‌ల‌ను మిత్రో అని సంభోదిస్తూ మొద‌లుపెడ‌తారు. ఇలా మిత్రో పేరు త్వ‌ర‌గానే ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. టిక్ టాక్‌ను వ్య‌తిరేకించే వారు, టిక్ టాక్ యూజ‌ర్లు కూడా కొంద‌రు మిత్రో యాప్ వైపు మ‌ళ్లుతున్నారు.

దీంతో మిత్రో యాప్‌కు వేగంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ యాప్ ప్రారంభించిన కేవ‌లం నెల రోజుల‌కే యాభై ల‌క్ష‌ల మంది మిత్రో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఈ యాప్ కూడా ఎంత పాపుల‌ర్ అవుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ యాప్ ఎక్కువ డౌన్‌లోడ్లు, మంచి రివ్యూలు, రేటింగ్‌ల‌తో ట్రెండింగ్‌లో ఉంది. టిక్‌టాక్‌లానే మిత్రో యాప్‌లోనూ అకౌంట్ లేక‌పోయినా వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. మొత్తంగా టిక్ టాక్‌కు త్వ‌ర‌లోనే మిత్రో యాప్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే యాపిల్ యూజ‌ర్ల‌కు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు శివాంక్ అగ‌ర్వాల్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

Related News