logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

శ్రీదేవి కూతురికి షాకిచ్చిన భారత వాయుసేన!

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట గ్లామర్ డాల్ గా జాన్వీ ని చిన్నచూపు చూసిన వారందరూ ‘దఢక్’ సినిమాలో ఆమె నటనకు ముక్కున వేలేసుకున్నారు. తాజాగా జాన్వీ నటించిన రెండో సినిమా కరోనా కారణంగా ఓటీటీ వేదికపై విడుదలైంది.
కార్గిల్ యుద్ధంలో పాల్గొని, తొలి యుద్ధ విమానం నడిపిన భారతీయ మహిళగా ఘనతకెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ట్రైలర్ తోనే జాన్వీ అద్భుతం చేసినదంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. సినిమాకు కూడా మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆ ఆనందం ఆమెకు ఎక్కువసేపు నిలవలేదు. ఈ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మొదట ధర్మ ప్రొడక్షన్ నిర్మించిన కారణంగా ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంది. తాజాగా భారత వాయుసేన నుంచి ఈ జాన్వీకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాలో తమను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ భారత వాయుసేన సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.

ఈ అంశంలో మరో ట్విస్ట్ ఏమిటంటే మాజీ పైలట్ గుంజన్ సక్సేనా కూడా వాయుసేనకు మద్దతు పలికారు. కార్గిల్ యుద్ధ సమయంలో పురుషులతో సమానంగా తనకు అవకాశాలు వచ్చాయని.. అలాగే ఉన్నతాధికారులు కూడా తనకు అండగా నిలిచారని ఆమె వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇప్పుడు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే దర్శక నిర్మాతలు వాయుసేనను కించపరిచే విధంగా కథ రాసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ కూడా స్పందించారు. తమ సొంత బలగాలను తక్కువ చేసి చూపేలా సినిమాలు తీయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేసారు.

Related News
%d bloggers like this: