logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీ నోటిఫికేషన్, హైద్రాబాద్లో ఖాళీలు

మీరు టెన్త్, ఇంటర్ , డిగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1,524 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైద్రాబాద్ లోనూ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.. స్టెనో గ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, హౌస్ కీపింగ్, కార్పెంటర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియయ మొదలైంది. ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు, చివరి తేదీ, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలను పరిశీలిస్తే..
వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్ లో 362, సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్ లో 28, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్ లో 132, సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్ లో 116, మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్ లో 479, ట్రైనింగ్ కమాండ్ యూనిట్ లో 407 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యన ఉండాలి. వేరువేరు పోస్టులకు వేరువేరు విద్యార్హతలు ఉన్నాయి. అయితే పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్,జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, లాంటి అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. హిందీ, ఇంగ్లీషు బాషలలో ప్రశ్నా పత్రం ఉంటుంది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

2021 మే 2 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్ సైట్(https://indianairforce.nic.in/) లో తెలుసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

 

 

Related News