logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

ఉత్తర కొరియాకు ఆ సాయం.. భారత్ నిర్ణయం

ఉత్తర కొరియా దేశానికి భారత్ భారీ సాయాన్ని అందించనుంది. ఉత్తర కొరియాలో టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ వ్యాధికి సంబందించిన ఔషదాలకు భారీగా కొరత ఏర్పడింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్తర కొరియాకు సాయం చేయాలని భారత్ ను కోరింది. కాగా ఈ ఔషధం నిల్వలు భారత్ లో ఉండగా భారత్ కొరియాకు సాయం చేయడానికి ముందడుగు వేసింది.

సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ టీబీ ఔషధాలను ఉత్తర కొరియాకు అందజేయాలని భారత్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధి అతుల్ మల్హరి ఈ ఔషధాలను ప్రభుత్వ అధికారికి అందజేశారు. ఈ మేరకు ఓ ఫోటోను కూడా విడుదల చేసారు. భారత్ ఉత్తర కొరియా ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుందని పేర్కొంది.

మానవతా దృక్పథంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరిక మేరకు తాము ఈ ఔషధాలను అందజేస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు లేకున్నా ప్రజలు మాస్కులు ధరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడు నెలల పాటు లేబర్ పనులు చేయిస్తుందట.

Related News