logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఒక్క రోజులో 10 వేల పాజిటివ్ కేసులు.. కరోనా కేసుల్లో భారత్ రికార్డు

భారత్ పై కరోనా పంజా విసురుతుంది. కోవిడ్ భారత్ లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి సారిగా 24 గంటల వ్యవధిలో 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. అటు కరోనా మరణాల రేటు కూడా పెరుగుతుంది. గడిచిన ఒక్క రోజులో 287 మంది కరోనాతో మరణించారని కేంద్ర కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తాజా కేసులతో భారత్ కరోనా కేసులలో స్పెయిన్ ను ధాటి 7వ స్థానం నుండి 5వ స్థానంలోకి ఎగిసింది. మొదటి 4 స్థానాలలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యుకె ఉన్నట్టుగా హాప్ కేన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 2,46,628 కు చేరింది. 6929 మంది ప్రాణాలు కోల్పోగా 1,20,406 మంది చికిత్స పొందుతున్నారు.

అటు తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 206 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 10 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 69 లక్షల 74 వేల 721 మంది కరోనా వైరస్‌ భారిన పడగా అందులో 4 లక్షా 2 వేల మంది మరణించారు. ప్రస్తుతం 31 లక్షల 61 వేల 346 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Related News