logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌

ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా – పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌బోయే తేదీని ఐసీసీ ప్ర‌క‌టించింది. అంతేకాదు, ఇండియా, పాక్ ఈ సిరీస్‌లో ఒకే గ్రూప్‌గా బ‌రిలోకి దిగుతున్నాయి. అక్టోబ‌రు 17 యూఏఈ, ఓమ‌న్ దేశాల్లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌బోతోంది. దాదాపుగా నెల రోజుల పాటు ఈ ఈవెంట్ క‌నువిందు చేయ‌నుంది. న‌వంబ‌ర్ 14న ఫైన‌ల్ జ‌రుగుతుంది.

ఐసీసీ టీ20 ర్యాంకుల ఆధారంగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న దేశాల గ్రూప్‌ల‌ను ఐసీసీ ఖ‌రారు చేసింది. ఫ‌స్ట్ రౌండ్‌లో గ్రూప్ – ఏ లో శ్రీలంక‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, న‌మీబియా ఉంటాయి. గ్రూప్ -బి లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, ప‌పువా న్యూగినియా, ఓమ‌న్ దేశాలు ఉంటాయి. సూప‌ర్ – 12లో గ్రూప్ – 1లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో పాటు తొలి రౌండ్‌లో అర్హ‌త సాధించిన రెండు టీములు ఉంటాయి.

సూప‌ర్ – 12 గ్రూప్‌లో – 2లో ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిల్యాండ్ ఆఫ్గానిస్థాన్ జ‌ట్ల‌తో పాటు తొలి రౌండ్‌లో క్వాలిఫై అయిన రెండు టీమ్‌లు ఉంటాయి. తొలి రౌండ్ అంటే క్వాలిఫైయింగ్ రౌండ్ అని అర్థం. ఈ రౌండ్‌లో క్వాలిఫై అయిన నాలుగు జ‌ట్ల‌కు సూపర్ – 12లో ఆడే అవ‌కాశం క‌ల్పిస్తారు. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ అక్టోబ‌రు చివ‌రిలో ఉండే అవ‌కాశం ఉంది. ఇంకా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుల్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్ర‌క‌టించ‌లేదు.

ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా చాలా ఆస‌క్తి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఏ దేశం గెలుస్తుంద‌నే ఉత్కంఠ ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచుల్లో మ‌న దేశ‌మే పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తోంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా – పాకిస్థాన్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌లు జ‌రిగితే ఐదింటిలోనూ ఇండియానే ఘ‌న విజ‌యం సాధించింది. ఈసారి ఏం జ‌రుగుతుందో చూడాలి. నిజానికి, ఈ సిరీస్ ఇండియాలోనే జ‌ర‌గాల్సి ఉంది. కానీ, క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల యూఏఈ, ఓమ‌న్‌కు వేదిక‌ను మార్చారు.

Related News