logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

61 దేశాల‌తో జ‌త క‌లిసిన భార‌త్‌.. డ‌బ్లూహెచ్ఓ ముందు డిమాండ్‌

క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది ? ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఒక పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్‌గానే మిగిలిపోయింది. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఓ స‌ముద్ర ఉత్ప‌త్తుల మార్కెట్‌లో ఈ వైర‌స్ మొద‌ట గ‌బ్బిలాల ద్వారా మ‌నిషిలోకి ప్ర‌వేశించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అంద‌రూ ఇదే న‌మ్ముతున్నారు. వుహాన్‌లోనే ఈ వైరస్‌కు సంబంధించి గ‌త డిసెంబ‌ర్‌లో మొద‌టి కేసు న‌మోదు కావ‌డంతో అంతా వుహాన్‌లోనే ఈ వైర‌స్ పుట్టింద‌నే ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు.

అయితే, ఈ వైర‌స్ త‌మ దేశంలోనే పుట్టింద‌నే దానికి చైనా మాత్రం ఒప్పుకోవ‌డం లేదు. క‌రోనా చైనీస్ వైర‌స్ అని, వుహాన్ వైర‌స్ అని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను చైనా ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తోంది. చైనాలో మొద‌ట వైర‌స్‌ను గుర్తించినంత మాత్రాన ఈ వైర‌స్ చైనాలో పుట్టిన‌ట్లు కాద‌ని చెబుతోంది. వుహాన్‌లో జ‌రిగిన ఆర్మీ క్రీడ‌ల‌కు వ‌చ్చిన అమెరికా ఆర్మీ ద్వారానే క‌రోనా వైర‌స్ చైనాలోకి ప్ర‌వేశించింద‌ని కూడా ఒకానొక స‌మ‌యంలో చైనా ఆరోపించింది.

ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది ? మ‌నిషిలోకి ఎలా ప్ర‌వేశించింది ? అనే గుట్టు తేల్చాల్సిందే అని భార‌త్‌తో స‌హా 62 దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేర‌కు ఇవాళ జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ హెల్త్ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెడుతున్నాయి. క‌రోనా వైర‌స్ పుట్టుక‌కు సంబంధించి ప‌రిశోధ‌న జ‌ర‌పాలనేది ఈ తీర్మానం డిమాండ్‌. భార‌త్‌తో పాటు యూకే, ర‌ష్యా, ఫ్రాన్స్‌, జ‌పాన్‌, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, సౌత్ ఆఫ్రికా, ట‌ర్కీ, బంగ్లాదేశ్‌, భూటాన్‌ వంటి దేశాలు ఈ తీర్మానానికి మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఇక‌, ఆసియాలోని పాకిస్తాన్, నేపాల్‌, శ్రీలంక, ఆఫ్ఘ‌నిస్తాన్ ఈ తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు.

Related News