logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

స‌రిహ‌ద్దులో త‌ల‌ప‌డిన భార‌త్ – చైనా సైన్యం.. సైనికుల‌కు గాయాలు

భార‌త్ – చైనా సైనికులు రెండు దేశాల స‌రిహ‌ద్దులో త‌ల‌ప‌డ్డారు. ఇరు దేశాల‌కు చెందిన 150 మంది సైనికులు శ‌నివారం ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకోగా ఏడుగురు చైనా సైనికుల‌కు, న‌లుగురు భార‌త సైనికుల‌కు గాయాల‌య్యాయి. సిక్కిం సెక్టార్‌లోని నాకులా పాస్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇరు దేశాల సైనికులు స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌హారా కాస్తుండ‌గా ఈ గొడ‌వ జ‌రిగింది. ఆయుధాల‌తో కాకుండా నిరాయుధులుగా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.

త‌ర్వాత ఇరు దేశాల సైన్యాధికారులు స‌మావేశ‌మై ఈ ఘ‌ర్ష‌ణ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. 2017 ఆగ‌స్టులో ల‌డ్ఢ‌క్‌లోని పాంగాంగ్ లేక్ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వాత మ‌ళ్లీ ఇటువంటిది జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. 2017లోనే డోక్లాం వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. 73 రోజుల పాటు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ స‌మ‌యంలో యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Related News