logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘గాల్వాన్ ఘర్షణల్లో భారత జవాన్లకు ఆయుధాలు ఎందుకు ఇవ్వలేదు’..?

లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న కారణంగా కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. హద్దులు మీరి ప్రవర్తించిన చైనాకు భారత్ ఎలాంటి సమాధానం ఇస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న మన సైన్యం నిరాయుధులుగా ఉన్న సమయం చూసి చైనా దొంగదెబ్బ తీసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ – చైనా కు వివాదాస్పద ప్రాంతంగా ఉన్న గాల్వాన్ లోయలో.. విధుల్లో ఉన్న మన సైనికులకు ఆయుధాలు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ వార్తలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు కచ్చితంగా ఆయుధాలు కలిగి ఉంటారని వివరించారు. జూన్ 15న అంటే ఘర్షణ జరిగిన సమయంలో కూడా జవాన్లు ఆయుధాలు కలిగి ఉన్నారన్నారు. కానీ 1993 చైనాతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఘర్షణ జరిగిన సమయంలో మన సైనికులు ఆయుధాలు ఉపయోగిచలేదని తెలిపారు. భారత్ – చైనా మధ్య ఈ ఒప్పందం ఎవరు చేసారు. అసలు ఈ ఒప్పందం లో ఏం ఉంది? అనే విషయాలు పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

1962 భారత్ – చైనా యుద్ధం తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేశాల మధ్య శాంతి నెలకొల్పే విధంగా 1988 లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ చైనా లో పర్యటించారు. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం రాజీవ్ గాంధీ పర్యటనతో చల్లబడిందని చెబుతారు. ఈ పర్యనటలో భారత్ – చైనాల మధ్య పలు కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే విధంగా రాజీవ్ గాంధీ కృషి చేసారు. ఈ చర్చల ద్వారా భవిష్యత్తులో భారత్ – చైనా దేశాల మధ్య రక్తపాతం జరగకూడదనే అవగాహనకు వచ్చాయి.

ఈ చర్చలను ఆధారం చేసుకునే మాజీ భారత ప్రధాని పీవీ నరసింహ రావు చైనాతో 1993 ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. వాస్తవాధీన రేఖ వద్ద చైనా – భారత్ సైనికులు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించరాదు. ఒక వేళ ఒక దేశ సైనికుడు వాస్తవాధీన రేఖను ధాటి వస్తే వెంటనే అతన్ని ఆ దేశం వెనక్కి రప్పించవలసి ఉంటుంది. ఆ తర్వాత దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఒప్పందానికి కొనసాగింపుగా 1996 లో మరో ఒప్పందం జరిగింది. సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే వెంటనే స్వీయ నియంత్రణ పాటించి చర్చలు జరపాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

అయితే తాజా ఘర్షణల్లో భారత సైనికులు నిరాయుధులుగా ఎందుకు ఉన్నారనే విషయం ఆర్టికల్ 6 లో స్పష్టంగా చెప్పబడింది. వాస్తవాధీన నియంత్రణ రేఖ కు రెండు కిలోమీటర్ల పరిధిలో ఇరు దేశాలకు సంబందించిన సైనికులు ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరపకూడదు. తుపాకులు పేల్చడం, పేలుడు పదార్థాలు వినియోగించడం చేయరాదని ఈ ఒప్పందంలో ఉంది. ఇరు దేశాల మధ్య ఎల్లప్పుడూ శాంతి పూరిత వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఒప్పందం చేసారు. అందుకే భారత్ – చైనా దేశాల మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా ఒక్క బులెట్ ను కూడా పేల్చరు.

Related News