logo

  BREAKING NEWS

బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |  

నాలుగున్నర దశాబ్దాల ఒప్పందానికి చైనా తూట్లు.. సరిహద్దుల్లో ఏం జరుగుతుంది?

భార‌త దేశం – చైనా మ‌ధ్య దాదాపు 3500 కిలో మీట‌ర్ల పొడ‌వున ఉన్న ఎల్ఏసీ పై ఇరు దేశాల మ‌ధ్య వివాదం నెల‌కొంది. 1962లో రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. స‌రిహ‌ద్దు స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు అక్క‌డ శాంతిని నెల‌కొల్పాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించాయి. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్ర‌శాంత‌త ఉండేది. కానీ కొన్ని రోజుల నుంచి… చైనా భారీగా మౌలిక వ‌స‌తుల‌ను, సైనిక మార్గాల‌ను, రైలు మార్గాల‌ను నిర్మిస్తోంది. ధీటుగా కూడా భార‌త్‌…మౌలిక వ‌స‌తుల‌ను నిర్మించుకొంటోంది.

ప్యాంగ్యాంగ్ సో సరస్సు చుట్టూ ఉన్న ఫింగర్ ఏరియాలో గాల్వన్‌ లోయలో దార్బుక్‌– షాయొక్‌– దౌలత్‌ బేగ్‌ ఓల్డీలను అనుసంధానించే విధంగా భారత్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భారత్ కు ఈ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకం కావడంతో చైనా వ్యతిరేకతను పట్టుంచుకోకుండా ముందుకు సాగుతుంది. తూర్పు లఢక్ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. 2022 నాటికి సరిహద్దుల్లో 66 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో మే 5న భారత్ -చైనా వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చైనా బలగాలు భారీగా మోహరించాయి. ఇరుప‌క్షాల మ‌ధ్య జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. అనంతరం భార‌త భూబాగంలోకి ప్ర‌వేశించిన చైనా సైనికులు గుడారాలు వేసుకున్నారు. భార‌త్ కూడా అదే స్థాయిలో మోహ‌రింపులు చేసింది. ఆనాటి నుండి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఇరుదేశాల సైనిక, దౌత్య అధికారులు చర్చలు జరుపుతున్నారు. అంతలోనే చైనా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటివరకు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించింది.

భారత భూభాగంలో గస్తీ నిర్వహిస్తున్న మన సైనికులపై చైనా బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడి చేసారు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన భారత జవాన్లు వెంటనే తేరుకుని ధీటుగా ప్రతిఘటించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తూ చైనా రేపిన ఈ చిచ్చుకు ఇరువైపులా 43 మంది సైనికులు మరణించినట్టుగా తెలుస్తుంది. అందులో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత అధికారులు ప్రకటించారు. ఇంకా 10 మంది సైనికుల ఆచూకీ తెలియరాలేదు. ఈ ఘర్షణల్లో తెలుగు యోధుడు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు(39) చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. ప్రస్తుతం సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేలా భారత బలగాలను ఉపసంహరించుకున్నట్టుగా మన దేశం ప్రకటించింది.

ఈ ఘటనపై చైనా స్పందించింది. తప్పంతా భారత్ దే అని బుకాయిస్తుంది. వాస్తవాధీన రేఖను రెండు సార్లు ధాటి వచ్చి భారత సైనికులే రెచ్చగొట్టారని ప్రకటనలు చేస్తుంది. పరిస్థితులు విషమించకుండా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూడాలని చైనా అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యలు చేశారు. చైనా వక్రబుద్దికి భారత్ ధీటుగా జవాబివ్వాలని భారత ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. భారత్ ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తుంది. చైనా తన వైఖరిని మార్చుకోకుంటే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించింది.

Related News