logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రష్యా వాక్సిన్ కోసం పోటీలో 20 దేశాలు.. వెనకడుగు వేస్తున్న భారత్..?

కరోనా భారిన పడి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఈ మహమ్మారిని అంతం చేసే వాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అగ్ర రాజ్యం మొదలు అన్ని దేశాలు పోటీపడుతున్నాయి. ఈ నేసథ్యంలో ప్రపంచంలోనే కరోనా కు తొలి వాక్సిన్ ను కనిపెట్టిన దేశంగా రష్యా నిలిచింది. ‘స్పుత్నిక్ వి’ పేరుతో తీసుకు వచ్చిన ఈ వాక్సిన్ అన్ని క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుందని, ఒక్క సారి వాక్సిన్ వేసుకుంటే రెండేళ్ల పాటు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఆ దేశ అధ్యక్షడు పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

కరోనా విలయ తాండవం చేస్తున్న దేశాల్లో రష్యా వాక్సిన్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. 20 కి పైగా దేశాలు వాక్సిన్ కోసం రష్యా ముందు క్యూ కట్టాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందిన దరఖాస్తులు బిలియన్ మార్కు దాటాయని ఆ దేశం వెల్లడించింది. కాగా భారత్ మాత్రం ఈ వాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. రష్యా వాక్సిన్ సామర్థ్యం పై ఆయా దేశాల శాస్త్రవేత్తల నుంచి భిన్న వాదనలు వినిపిస్తుండటమే అందుకు కారణం. ఈ వాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాలేదు.

అంతకు ముందే వాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను రష్యా పూర్తి చేసింది. ట్రయల్స్ డేటాను కూడా ఇంకా విడుదల చేయలేదు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయకుండానే ఈ వాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురావడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. మొదట ఈ వాక్సిన్ ను కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించడానికి అక్కడి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇప్పుడు ఈ మందు కరోనాకు ఎంత వరకు సురక్షితం, ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉందా లేదా అనే విషయం పై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ వాక్సిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రన్ దీప్ గులేరియా స్పందించారు. రష్యా వాక్సిన్ విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వాక్సిన్ ను ఉత్పత్తి చేసుకునే ముందు దీని భద్రతా ప్రమాణాలను పరిశీలించవలసి ఉంటుందన్నారు. వాక్సిన్ తీసుకోవడం వల్ల శరీరంలో అభివృద్ధి బాడీలు ఎంత కాలం కొనసాగుతాయనే విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పూర్తిగా పరీక్షించని వాక్సిన్ ను లక్షలాది మంది ప్రజలపై ప్రయోగించడం అనైతిక చర్యగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

వ్యా‍క్సిన్‌ ట్రయల్స్‌ డేటాను, సేఫ్టీ డేటాను అమెరికా, యూరప్‌తో పాటు పలు దేశాలకు సమర్పించాలని అప్పుడే ఈ వ్యాక్సిన్‌కు లైసెన్స్ లభిస్తుందని అంటున్నారు. కాగా భరత్ లో తయారు చేస్తున్న దేశీయ వాక్సిన్ లు రెండు మూడవ దశలో ప్రయోగాలు జరుపుకుంటున్నాయి. ఆ పరీక్షలు విజయవంతమైతే భారత్ అనేక దేశాలకు ఈ వాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉంది.

Related News