logo

  BREAKING NEWS

ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |  

ప్రభాస్ సినిమాకు హైలెట్ గా మారనున్న 1980 సీన్!

‘సాహో’ సినిమా కొంత నిరాశ పరిచినప్పటికీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఈ సినిమాతో ఉత్తరాదిలో ప్రభాస్ కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు ప్రకటించి అభిమానులకు భారీ సర్ప్రైస్ ఇచ్చాడు ప్రభాస్. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమా, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్. ఈ నాలుగు సినిమాలతో మరో ఐదేళ్ళపాటు బిజీగా మారనున్నాడు ప్రభాస్.

ఈ సినిమాల్లో పూజ హేగ్దే- ప్రభాస్ జంటగా నటిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం రాధే శ్యామ్. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే రిలీజ్ కానుంది. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. రాధే శ్యామ్ సినిమాను కూడా రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పై ఇప్పుడో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ రిచ్ బిజినెస్ మేన్ పాత్రలో కనిపించనున్నాడు. దేశ ప్రధానుల్ని సైతం కలిసి మాట్లాడే పవర్ ఫుల్ రోల్. 1980 రెట్రో డేస్ లో ఖరీదైన కార్ల వ్యాపారిగా కనిపిస్తాడట. అప్పట్లో హీరో లెజండరీ ప్రధాని ఇందిరా గాంధీని కలుసుకునే సీన్ ఒకటి చిత్రీకరిస్తున్నారట. ఆమె కార్యాలయంలో ఆ బిజినెస్ మ్యాన్ కి తప్ప మరొకరికి కలిసి మాట్లాడే ఛాన్స్ ఉండదట.

ప్రధానితో అంత సాన్నిహిత్యం ఉంది అంటే కచ్చితంగా ఆమెకు స్నేహితుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ సీన్ సినిమాలోనే హైలెట్ గా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాధే శ్యామ్ టీమ్ ప్రభాస్ ఇందిరా గాంధీని ఆమె కార్యాలయంలో కలుసుకునే సీన్ కు సంబందించిన షూటింగ్ జరుపుతున్నారు. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఒక సెట్ ను రూపొందించారు. ప్రధానికి ప్రభాస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు. ఈ వార్త ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాపై భారీ అంచనాలను పెంచే విధంగా ఉంది. రాధే శ్యా సినిమా 2021లో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం కానుంది.

 

 

 

Related News