logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?

శ‌మీ శ‌మ‌యతే పాపం.. శ‌మీ శ‌త్రు వినాశ‌నీ.. అర్జున‌స్య ధ‌నుర్దారీ రామ‌స్య ప్రియ‌ద‌ర్శ‌నం అనే శ్లోకం చాలా మందికి తెలిసి ఉంటుంది. విజ‌య‌ద‌శ‌మి నాడు ఈ శ్లోకాన్ని చ‌ద‌వ‌డం ఒక సంప్ర‌దాయం. ఈ శ్లోకాన్ని చ‌దువుతూ జ‌మ్మిచెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి పూజిస్తే అంతా విజ‌య‌మే ద‌క్కుతుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. జ‌మ్మి చెట్టుని శ‌మీ వృక్షం అని కూడా అంటారు. ద‌స‌రా పండుగ నాడు జ‌మ్మి చెట్టుకు పూజ‌లు జ‌ర‌ప‌డం ఆన‌వాయితీ. పూజ‌ల అనంత‌రం జ‌మ్మి ఆకును పెద్ద‌ల‌కు అందించి ఆశీర్వాదం తీసుకోవ‌డం కూడా ఒక సంప్ర‌దాయం.

స్నేహితుల‌కు, బంధుమిత్రుల‌కు కూడా జ‌మ్మి ఆకును ఇచ్చి విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం తెలంగాణ‌లో ఆన‌వాయితీ. విజ‌య‌ద‌శ‌మి రోజున జ‌మ్మి చెట్టును పూజించ‌డం అనేది ఇప్ప‌టి సంప్ర‌దాయం మాత్ర‌మే కాదు. యుగ‌యుగాల నుంచి వ‌స్తున్న ప‌ద్ధ‌తి ఇది. పాండ‌వులు ఆజ్ఞాత‌వాసానికి వెళ్లే ముందు వారి ఆయుధాల‌ను, వ‌స్త్రాల‌ను జ‌మ్మిచెట్టుపై దాస్తారు. ఆజ్ఞాత‌వాసం పూర్తైన త‌ర్వాత ఈ వృక్షాన్ని పూజించి త‌మ ఆయుధాల‌ను తిరిగి ధ‌రిస్తారు.

అప‌రిజితా దేవి జ‌మ్మి చెట్టు రూపంలో ఉంటుంద‌ని న‌మ్మ‌కం. అందుకే ఈ చెట్టును పూజిస్తే అప‌రిజితా దేవిని పూజించిన‌ట్లే. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండ‌వులు శ‌మీవృక్షం రూపంలో ఉన్న అప‌రిజితా దేవిని పూజించి యుద్ధానికి వెళ్లి కౌర‌వుల‌ను ఓడించి విజ‌యం సాధిస్తారు. దీంతో జ‌మ్మి చెట్టును పూజిస్తే అంతా విజ‌య‌మేన‌ని, అప‌జ‌యం ఉండ‌ద‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

మ‌హాభార‌తంలోనే కాదు రామాయ‌ణంలోనూ జ‌మ్మి చెట్టుకు ప్రాధాన్య‌త ఉంది. శ్రీరాముడు రావ‌ణాసురుడిపై దండెత్తే ముందు శ‌మీవృక్షాన్ని పూజిస్తాడు. విజ‌య‌ద‌శ‌మి నాడు రావ‌ణ సంహారం చేసిన త‌ర్వాత కూడా ఆయ‌న శ‌మీవృక్షానికి పూజ‌లు చేస్తాడు. ఆ సంప్ర‌దాయం ప్ర‌కార‌మే ఇప్ప‌టికీ విజ‌య‌ద‌శ‌మి నాడు ఊరూవాడా రావ‌ణాసురుడి బొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేసి శ‌మీ వృక్షానికి పూజ‌లు చేస్తున్నాము.

విజ‌య‌ద‌శ‌మి నాడు జ‌మ్మి చెట్టుకు పూజిస్తే అపరిజితా అమ్మ‌వారి అనుగ్రహం క‌లుగుతుంద‌నేది అంద‌రి న‌మ్మ‌కం. జ‌మ్మి చెట్టుకు పూజ చేయ‌డంతో పాటు పాల‌పిట్టను ద‌ర్శించుకొని తిరిగి ఇళ్ల‌కు రావ‌డం సంప్ర‌దాయం. ఇళ్ల‌కు వ‌చ్చే ముందు జ‌మ్మి ఆకును తీసుకువ‌చ్చి పెద్ద‌ల‌కు, స్నేహితుల‌కు, బంధుమిత్రుల‌కు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవ‌డం, అల‌య్‌భ‌ల‌య్ పొందే ఆన‌వాయితీ చాలా ప్రాంతాల్లో ఉంటుంది.

Related News