logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ధనత్రయోదశి రోజునే బంగారం ఎందుకు కొంటారు?

ధనత్రయోదశికి ఉత్తరాది ప్రజలు దంతేరస్ గా జరుపుకుంటారు. ఈరోజున బంగారం కొనడం ఆనవాయితీ. పాలకడలిలో శేషతల్పం పైన శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే లక్ష్మి దేవి ఈరోజునే భువి పైకి కదిలి వస్తుందని భక్తులను అనుగ్రహిస్తుందని నమ్మకం. అయితే లక్ష్మి దేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఏం చేయాలి? ఎలా పూజించాలో తెలుసుకుందాం..

కలియుగం ప్రారంభమైన తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోవటానికి భృగు మహర్షి వైకుంఠానికి వెళతాడు. తన రాకను గమనించలేదన్న కోపంతో శ్రీ విష్ణువు , లక్ష్మ దేవీలపై ఆగ్రహిస్తాడు. ఆ కోపంలో శ్రీ విష్ణువు వక్ష స్థలంపై తన్నడంతో ఆ వక్షస్థలంలో నెలవైన లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చినట్టు ‘శ్రీ వేంకటాచల మహత్యం’ కథ చెబుతుంది. వైకుంఠం నుంచి అలిగి వచ్చిన లక్ష్మి దేవి నేటి కొల్హాపూర్ అయిన కరవీరపురానికి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న కుబేరుడు అక్కడకు వెళ్లి ఆమె ను పూజించి లక్ష్మి దేవి కటాక్షం పొందుతాడట.

అందుకే ఈ రోజును కుబేర త్రయోదశి అని, ఐశ్వర్య త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని యమ త్రయోదశిగా కూడా పిలుస్తారు. ఈరోజు నుంచే ప్రజలు దీపావళి వేడుకలను మొదలు పెడతారు. ధన త్రయోదశి నాడు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి రెండు వైపులా మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు. వీటినే యమ దీపాలు అని కూడా పిలుస్తారు. ఈ దీపాలను వెలిగించడం ద్వారా అకాల మృత్యుభయం తొలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం రోజునే ధన్వంతరీ కూడా జన్మించాడు. అందుకే దీనిని ధన్వంతరీ జయంతి అని కూడా పిలుస్తారు.

శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరీ ఆరోగ్యానికి అధిదేవత. ఈరోజున ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మహాలక్ష్మి, కుబేరులు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా ధన త్రయోదశి రోజున వీరిని కొలిస్తే ఆయురారోగ్యాలతో పాటుగా ఐశ్వర్యాభివృది, సౌభాగ్యం కూడా సిద్ధిస్తుందని ప్రతీతి. అందుకే ధనత్రయోదశి రోజున వివిధ ప్రాంతాలలోని ప్రజలు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. వాటిని లక్ష్మి దేవి ముందు పెట్టి పూజిస్తారు. ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా లక్ష్మి దేవి ఇంట కొలువై ఉంటుందనేది భక్తుల నమ్మకం. ఉత్తరాదిన కనిపించే ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచమంతటా కనిపిస్తుంది.

Related News