logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పశ్చిమ బెంగాల్ లో పీఠం ఎవరిది? ఆ సర్వే ఏం తేల్చింది?

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోపశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కాయి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే మరో వైపు బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసేది ఎవరనే విషయంపై ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

పశ్చిమ బెంగాల్ లో ప్రధానంగా మూడు పార్టీల మధ్యన పోటీ నెలకొంది. మమతా బెనర్జీ ఆధిపత్యం వహిస్తున్న తృణముల్ కాంగ్రెస్, బీజేపీ లు ఒంటరిగా పోరాటానికి సిద్దమవగా కాంగ్రెస్ మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. రెండేళ్ల క్రితం వరకు పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ఉనికి లేకుండా ఉన్న బీజేపీ లోక్ సభ ఎన్నికలతో ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ ఎన్నికల్లో ఏకంగా ఆ 18 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ అగ్రనేతలు, అమిత్ షా, జేపీ నడ్డలు కూడా ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది.

తృణమాల్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులను ఇప్పటికే బీజేపీ తమ పార్టీలోకి లాగేసుకుంది. ముఖ్య నేతలు వెళ్ళిపోయినా ప్రజల మద్దతు మాత్రం తనకే ఉంటుందని మమతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టైమ్స్ నౌ -సి ఓటర్ నాడీ పట్టుకునే ప్రయత్నం చేసింది.

వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకె దక్కనుందని సర్వేలో వెల్లడైంది. గతంలో కన్నా మెజారిటీ తగ్గుతుందని తెలిపింది. 294 అసెంబ్లీ స్థానాలకు గాను 162 స్థానాలను తృణముల్ పార్టీ, 99 నుంచి 115 స్థానాలను బీజేపీ దక్కినందుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అయితే కాంగ్రెస్ కూటమి మాత్రం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని తేల్చింది.

అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె యూపీఏ ఘనవిజయం సాధిస్తుందని తేలింది. ఈ కూటమి 158 స్థానాలు సాధిస్తుందని, తెలిపింది. మరోవైపు అన్నాడీఎంకే – బీజేపీల ఎన్డీఏ 65 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని వెల్లడించింది. తమిళనాడులో ప్రధాని పాలనపై 53. 26 శాతం అంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 34.35 శతం మంది మోదీని ప్రధానిగా కోరుకున్నారు.

అస్సాం రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎండీ స్వల్ప మెజారిటీతో గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రానుందని తెలిపింది. కేరళ రాష్ట్రంలో వామపక్షల కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చింది. కేరళలో నరేంద్ర మోదీని ప్రధానిగా కోరుకునేవారు శాతం 31. 95 గా ఉండగా, 55. 84 శాతం మంది రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకోవడం విశేషం.

Related News