logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. !

కరోనా లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సినీ ప్రముఖులు కూడా అతీతం కాదని తెలుస్తుంది. సినీ నటి రమ్యకృష్ణ కారులో అక్రమ్మగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పాండిచ్చేరి నుంచి చెన్నై వైపుగా వెళ్తున్న రమ్య కృష్ణ కారును పోలీసులు తనిఖీ చేయగా కారులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం లభించింది.

ప్రతిశుటం లాక్ డౌన్ కారణంగా రమ్య కృష్ణ చెన్నైలో ఉంటుంది. అయితే కరోనా వల్ల చెన్నై ప్రభుత్వం మద్యం సరఫరాను నిలిపివేసింది. మద్యం లభించకపోవడంతో మహాబలిపురం నుంచి అక్రమంగా మద్యం తెప్పిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో రమ్య కృష్ణ కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఆ వెంటనే రమ్య కృష్ణ స్వయంగా కారులో వచ్చి డ్రైవర్ ను బెయిల్ పై విడుదల చేయించారని సమాచారం. కారు డ్రైవర్ సెల్వ కుమార్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఇంత భారీ స్థాయిలో మద్యం అతను ఎందుకు తరలిస్తున్నాడనే విషయం తెలియరాలేదు.

Related News