logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

మరో వివాదంలో ఇళయరాజా.. ఎల్వీ ప్రసాద్ వారసుడిపై పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయ రాజా మరో వివాదంలో నిలిచారు. ఎల్వీ ప్రసాద్ వారసుడు, ఆయన మనవడు సాయి ప్రసాద్ పై ఇళయ రాజా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రసాద్ స్టూడియో నుంచి తనను దౌర్జన్యంగా బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, తన విలువైన సంగీత పరికరాలను ధ్వంసం చేసారని సాయిప్రసాద్ పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

వీరిద్దరి మధ్య ఈ వివాదం ఏళ్లుగా సాగుతున్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎల్వీ ప్రసాద్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో నిర్మించే సమయంలో ఇళయ రాజాపై ఆయనకున్న అభిమానంతో ఒక గదిని బహుమతిగా ఇచ్చారు. ఇది 40 ఏళ్ల క్రితం విషయం. ఇటీవల ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ ఇళయ రాజాను ఆ గదిని ఖాళి చేయాలనీ ఇన్నేళ్ళుగా వాడుకున్నది చాలని ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాడట.

అయితే ఈ గదిని తనకు ఎల్వీ ప్రసాద్ బహుమతిగా ఇచ్చారని 40 ఏళ్లుగా ఇక్కడే తాను సినిమాలకు పని చేస్తున్నానని ఇళయరాజా వాదిస్తున్నారు. దీనిపై ఇద్దరూ కోర్టుకెక్కారు కూడా. అయితే ఈ కేసు కోర్టులో ఉండగానే తాజాగా సాయి ప్రసాద్ తన గదిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని తన విలువైన మ్యూజికల్ ఎక్విప్మెంట్ ను ధ్వంసం చేసాడని అంటున్నారు. చెన్నై పోలీసు కమిషనరేట్ లో సాయి ప్రసాద్, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని కోరారు.

Related News