logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

ఫలించిన జగన్ వ్యూహం.. ఏపీ క్యాడర్ కు ఆ ఐఏఎస్ అధికారిని!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మంది ఐఏఎస్ అధికారుల తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసారు. అందులో ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మి, స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. కేసీఆర్ తో జరిగిన తొలి భేటీలోనే వీరిని ఏపీకి బదిలీచేయాలని సీఎం జగన్ కేసీఆర్ ను కోరారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ పై ఏపీకి వెళ్లాలని శ్రీలక్ష్మి ప్రయత్నాలు చేయగా అది కుదరదని స్పష్టమైంది. అయినా ఆమె పట్టువీడకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ఏపీ క్యాడర్ ను సాధించారు.

అవినీతి ఆరోపణల కేసులో రెండేళ్ల పటు జైలు శిక్ష అనుభవించిన ఆమెకు విడుదలైన అనంతరం రాష్ట్రవిభజనలో భాగంగా తెలంగాణ కేడర్ ను కేటాయించారు. ఆ తర్వాత ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి వెళ్లాలన్న ఆమె ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అయినప్పటికీ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు.

దీంతో క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేసింది. వెంటనే ఆమె అమరావతి సచివాలయంలో జీఏడీలో రిపోర్టు చేసారు. ఈమేరకు త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆమెకు పోస్టింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ లక్ష్మి మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసారు.

ఆ సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న ఆమె రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అక్కడే ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆమెకు తెలంగాణ క్యాడర్ కేటాయించారు. ఏపీలో జగన్ ప్రభుత్వ ఏర్పడిన నాటి నుంచి ఏపీలో పనిచేయాలని వేచి చూస్తున్నారు.

అందుకు సీఎం జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసారు. ఎట్టకేలకు ఆమె తన క్యాడర్ ను ఏపీకి మార్చుకున్నారు. త్వరలోనే ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఏపీకి రానున్నారని అటు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

 

Related News