logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

పెళ్లంటూ జరిగితే ఆమెతోనే.. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన హైపర్ ఆది?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమయ్యాడు హైపర్ ఆది. తనదైన శైలి పంచులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఈ కమెడియన్ కు వెన్నతో పెట్టిన విద్య. తన టాలెంట్ తో టీమ్ మెంబరు నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు వరుస పెట్టి సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. ఇదిలా అంటే హైపర్ ఆది త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

గతంలో లేడీ యాంకర్ అనసూయ, హైపర్ ఆదిల మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అనే రూమర్లు గుప్పుమన్నాయి. వీరిద్దరూ స్టేజిపై చేసే హంగామా ఆలా ఉండేది మరి. అయితే అనసూయకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఈ వార్తలు అంతగా క్లిక్కవ్వలేదు. ఆ తరువాత ‘ఢీ’ డాన్స్ షో లో యాంకర్ వర్షిణితో రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు ఆది. కొంతకాలం వీరిద్దరి జోడీ హాట్ టాపిక్ గా మారింది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే చేసుకుంటానని చెప్పి షాకిచ్చాడు.

అది కూడా పెళ్లంటూ చేసుకుంటే తన సొంత జిల్లా అయిన ప్రకాశానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చాడట. ఇప్పటికే ఆది తల్లిదండ్రులు సంబంధాలు వెతకడం మొదలు పెట్టారని ఓ అమ్మాయిని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. అంతా అనుకుంటున్నట్టుగా జరిగితే ఈ ఏడాది మే నెలలో హైపర్ ఆది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని సన్నహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే హైపర్ ఆది స్పందించాల్సిందే.

 

Related News