logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

యువతిపై 143 మంది అత్యాచారం.. నిందితుల్లో ప్రముఖులు, సినీ నటులు!

తెలంగాణ రాష్ట్ర పోలీసు చరిత్రలోనే సంచలన కేసు పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైంది. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసులను ఆశ్రయించిన ఓ యువతీ తనపై 11 ఏళ్లుగా 143 మంది 5 వేల సార్లు అత్యాచారం జరిగినట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ వేములపల్లికి చెందిన బాధితురాలికి ఆమె మైనర్ గా ఉన్న సమయంలోనే 2009 లో మిర్యాలగూడకు చెందిన కె. రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

కొద్ది రోజులకే అత్తింటివారి వేధింపులు తాళలేక అదే సంవత్సరం ఆమె తన తల్లిదండ్రుల సహాయంతో భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం సోమాజిగూడలోని ఓ వసతి గృహానికి వచ్చి చదువును కొనసాగించాలని అనుకుంది. అక్కడికి వచ్చి వెళ్లే సుమన్ అనే వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని దగ్గరకు వెళ్లానని ఆ రోజు అతను తనపై అత్యాచార చేసినట్టుగా తెలిపింది. అంతేకాకుండా ఆ వీడియోలను యూట్యూబ్ లో పెడతానని తనను బెదిరించేవాడని తెలిపింది. తనను బెదిరించి సెక్స్ రాకెట్ లోకి దింపాడని అతనితో పాటు 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం జరిపారని పేర్కొంది.

వారిలో యాంకర్లు, సినీ నటులు, మాజీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడు, విద్యార్ధి సంఘాల నేతలు కూడా ఉన్నట్టుగా తెలిపింది. వీరంతా తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని సార్లు వయాగ్రా ట్యాబ్లేట్లు వేసుకుని తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారిని, దళితురాలైన తనను కులం పేరుతో దూషించేవారని పేర్కొంది.

ఈ క్రమంలో తాను కొన్ని సార్లు గర్భం దాల్చగా వారే తనకు గర్భస్రావం చేయించేవారని తెలిపింది. ఈ బాధలు భరించలేక తాను ‘గాడ్ ఫాదర్’ అనే సంస్థలు ఆశ్రయించి వారిచ్చిన ధైర్యంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 42 పేజీల ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం గమనార్హం. శుక్రవారం బాధితురాలిని భరోసా సెంటర్ కు తరలించి అనంతరం వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ ఘటనపై నిర్భయ కేసుతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు.

Related News