logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

మరో దారుణం: పెళ్ళైన నాలుగు నెలలకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దివ్య(22) ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్ళైన నాలుగు నెలలకే అత్తింటి వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి లోని బతికపల్లి గ్రామానికి చెందిన అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్యను అదే గ్రామానికి చెందిన ప్రవీన్‌రెడ్డి తో 2020 ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. దివ్య హైద్రాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు.

పెళ్లి సమయంలో దివ్య కుటుంబం రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ఇచ్చారు. అయితే ఇటీవల దివ్య తల్లిదండ్రులకు చెందిన వ్యవసాయపు బావిని కూడా అమ్మి డబ్బు తేవాలని ప్రవీణ్ రెడ్డి దివ్యను వేధించసాగాడు. అంతేకాకుండా దివ్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ.. వాట్సాప్ ద్వారా అసభ్య మెసేజిలను పంపేవాడు. దీంతో నాలుగురోజుల క్రితం దివ్య హైద్రాబాదు నుంచి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. భర్త వేధింపుల గురించి చెప్పడంతో దివ్యను అత్తారింట్లో దింపడానికి తీసుకెళ్లారు.

ఈ సమయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన దివ్య మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చింది. గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న తమ తల్లిదబండ్రుల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన అల్లుడు ప్రవీణ్ రెడ్డి అతని కుటుంబంపై దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎస్సై నవతలు ఆధ్వర్యంలో దివ్య మృతదేహాన్ని వెలికి తీసి శవ పంచనామా చేసారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Related News