హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫేస్ బుక్ పరిచయం ఓ యువతీ కొంపముంచింది. ప్రేమ పేరుతో యువతిని మోసగించడమే కాకుండా ఆమెను శారీరకంగా లోబరుచుకుని చివరకు ముఖం చాటేశాడు ఓ ప్రబుద్దుడు. ఈ విషయం బాధితురాలు అతని భార్యకు చెప్పడంతో భార్య భర్తలు ఇద్దరూ కలిసి బాధితురాలిని వేధించడం మొదలు పెట్టారు.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని తార్నాక కింతే కాలనికి చెందిన స్రవంతి(26) అనే యువతి మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె ఫోన్ కు కరణ్ రెడ్డి అనే పేరుతో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి యువతితో మెల్లిగా మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు.
కొన్ని రోజులకు వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. స్నేహితుడని నమ్మిన స్రవంతి తన వ్యక్తిగత విషయాలన్నీ అతనితో పంచుకుంది. ఓ రోజు కరణ్ రెడ్డి స్రవంతిని బంజారాహిల్స్ లో ఉన్న తన ఆఫీసు కరణ్ కాన్సెప్ట్స్ కు రావాలని కోరాడు. అక్కడకు వెళ్లిన స్రవంతితో అసభ్యంగా ప్రవర్తించాడు. నువ్వంటే నాకిష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు.
ఆ తర్వాత కొన్ని రోజుల పటు వీరిద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగింది. తాజాగా స్రవంతిని కరణ్ రెడ్డి తన వాట్సాప్,పేస్ బుక్ లలో ఆమెను బ్లాక్ చేసాడు. ఆ విషయమై నిలదీయగా పెళ్లి చేసుకోనని చెప్పి మొహం చాటేశాడు. ఈ విషయమై అతని భార్య మానస రెడ్డిని సంప్రదిస్తే తన భర్తను వదిలేయాలంటూ ఆమె వార్నింగ్ ఇచ్చింది. భార్యా భర్తలు ఇద్దరు కలిసి ఆమెను వేధించడంతో స్రవంతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.